Begin typing your search above and press return to search.

2020 నీతి సూక్తి: బంధుప్రీతి త‌గదు సుమీ

By:  Tupaki Desk   |   2 Jan 2020 7:37 AM GMT
2020 నీతి సూక్తి: బంధుప్రీతి త‌గదు సుమీ
X
ఇండ‌స్ట్రీ లో బంధు ప్ర‌తీ అనేది కొంత వ‌ర‌కే ప‌రిమితం. త‌ర్వాత త‌న‌కు తానుగానే పైకి ఎద‌గాలి. అందుకు ట్యాలెంట్ ఒక్క‌టే అవ‌స‌రం. ఏ రంగంలోనైనా ప్ర‌తిభ ఒక్క‌టై పైకి తీసుకెళ్తుంది. ట్యాలెంట్ లేకుండా మాట‌ల‌తో మాయ చేసేద్దామంటే కుద‌ర‌దు. ఆ మ్యాజిక్ కొన్ని రోజులే ప‌నికొస్తుంది. త‌ర్వాత అయినా ఒంటరి గా పోరాటం చేయ‌క త‌ప్ప‌దు. అదీ నేటి కాంపిటీష‌న్ లో ట్యాలెంట్ ఉంటేనే రెస్పెక్ట్. దాంతోనే రాణించ‌డం కుదురుతుంది. ఇటీవ‌ల మ‌త్తువ‌ద‌ల‌రా సినిమా తో సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీ‌ సింహా హీరోగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.

మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చింది. కొత్త న‌టీన‌టులు స్క్రిప్ట్ స‌హా మేకింగ్ లోపాలు క‌నిపించాయి. దీంతో ఆడియ‌న్స్ కు అంత‌గా రీచ్ అవ్వ‌లేదు. ఇక మొద‌ట్లో ప్ర‌చారం విష‌యంలో కీర‌వాణి కుటుంబ స‌భ్యులు అంత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌న‌ప్ప‌టికీ చివ‌రి నిమిష‌యంలో సింహాని హైలైట్ చేసే ప్ర‌య‌త్నం చేసారు. కీర‌వాణి స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేయ‌డం... రాజమౌళి త‌న స్థాయికి దిగి అందులో న‌టీన‌టుల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం తో బంధుప్రీతి స్ప‌ష్టం గా క‌నిపించింది. అక్క‌డి తో ఆగ‌కుండా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఇబ్బంది పెట్టి మ‌రీ రంగంలోకి దించి ఈ త‌ర‌హా ప్ర‌యత్నం చేసారు.

అదే బంధు ప్రీతి తో ప్ర‌భాస్ ని త‌మ సినిమా ప్ర‌చారం కోసం వాడుకోవ‌డం పై కొన్ని నెగిటివ్ కామెంట్లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. త‌మ ఫ్యామిలీ న‌టుడు కాబ‌ట్టి బంధు ప్రీతి చూపించడంలో త‌ప్పులేదు. కానీ అప్పుడ‌ప్పుడు కంటెంట్ ఉన్న సినిమాల‌ను కూడా ఎంక‌రేజ్ చేస్తే బాగుండేద‌ని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి- రానా లా పెద్దోళ్లంతా బాగున్న‌ చిన్న సినిమాను ప్రోత్స‌హిస్తే ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని అంటున్నారు. ట్యాలెంట్ కు కొల‌మానాలు లేకుండా ఎంక‌రేజ్ చేయాల‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి విష‌యాల్ని బ‌న్ని- అల్లు అర‌వింద్ కాంపౌండ్ కాస్త స‌పోర్టివ్ గా ఉంటున్న సంగ‌తిని ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు.