Begin typing your search above and press return to search.

యువ హీరోకి హిట్టు కావలెను..!

By:  Tupaki Desk   |   21 Sep 2022 12:30 PM GMT
యువ హీరోకి హిట్టు కావలెను..!
X
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య మంచి సక్సెస్ కోసం చూస్తున్నారు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. 'ఛలో' తర్వాత ఆ రేంజ్ హిట్టు కోసం కష్టపడుతున్న శౌర్య.. ఇప్పుడు "కృష్ణ వ్రింద విహారి" సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు.

నాగశౌర్య స్వీయ నిర్మాణంలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''కృష్ణ వ్రింద విహారి''. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన KVV టీజర్ - ట్రైలర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం సినిమా బాగా వచ్చిందని తెలుస్తోంది. ప్రేక్షకులు కథను అంగీకరిస్తే మాత్రం IRA క్రియేషన్స్ బ్యానర్ లో 4వ సినిమాతో రెండో హిట్ ని అందుకోవచ్చు.

'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని సెప్టెంబరు 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడమే కాదు.. టీమ్ అంతా వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని జనాలను చేరువ చేయడం కోసం నాగశౌర్య చాలా కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల చేసిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక సినిమా కోసం పాదయాత్ర చేయడమనేది సినీ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

నాగశౌర్య కెరీర్ సాఫీగా సాగాలంటే ఇప్పుడు నిజంగా ఒక సాలిడ్ హిట్ అవసరముంది. ఈ నేపథ్యంలో రాబోతున్న 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కచ్చితంగా సక్సెస్ అందిస్తుందని శౌర్య అండ్ టీమ్ నమ్మకంగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, KVV సినిమాలో నాగశౌర్య సరసన షిర్లే సెటియా హీరోయిన్‌ గా నటించింది. ఇందులో రాధిక శరత్‌ కుమార్ కీలక పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - సత్య - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.