Begin typing your search above and press return to search.

ప‌రిశ్ర‌మ‌లో కొత్త మెరుపులు..భ‌విష్య‌త్ తార‌లు!

By:  Tupaki Desk   |   13 Nov 2022 2:30 AM GMT
ప‌రిశ్ర‌మ‌లో కొత్త మెరుపులు..భ‌విష్య‌త్ తార‌లు!
X
సినీ ప‌రిశ్ర‌మ‌కి ఎంతో మంది వ‌స్తుంటారు. కానీ అందులో కొంద‌రే నిలదొక్కుకుని నిల‌బ‌డ‌తారు. వాళ్లే భ‌విష్య‌త్ తార‌లుగా కొన‌సాగుతారు. ఓవైపు వార‌స‌త్వం కొన‌సాగుతున్నా..మ‌రోవైపు ఎలాంటి బ్యాక‌ప్ లేకుండా వ‌చ్చే వాళ్లు వ‌స్తూనే ఉంటారు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ‌. తాజాగా టాలీవుడ్ లో అలాంటి కొత్త వాళ్ల గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే! ఈ ఐదుగురు గురించి త‌ప్ప క స్మ‌రించుకోవాల్సిందే.

'ఫ‌ల‌క్ నుమా దాస్' తో ప‌రిచ‌య‌మైన విశ్వ‌క్ సేన్ ఎలాంటి స‌పోర్ట్ లేకుండానే ఇండ‌స్ర్టీకి వ‌చ్చాడు. కుర్రాడు మ‌ల్టీ ట్యాలెంటెడ్ అని చెప్పొచ్చు. నటుడిగా..ద‌ర్శ‌కుడిగా..ర‌చ‌యిత‌గా ఆరంభంలోనే ముద్ర వేసాడు. హీరోగా న‌టిస్తూనే నిర్మాత‌గానూ సినిఆమ‌లు చేస్తున్నాడు. న‌టుడిగా చేతిలో అవ‌కాశాలు బాగానే ఉన్నాయి. విశ్వ‌క్ లో ఎన‌ర్జీ అద‌న‌పు క్వాలిఫికేష‌న్ గా చెప్పొచ్చు.

త‌నదైన ఎన‌ర్జీ తో దూసుకుపోతున్నాడు. అదే ఎన‌ర్జీ కొన్ని చోట్లు వివాదాల‌కు దారి తీస్తున్నా? మ‌రికొన్ని చోట్ల కలిసొస్తుంది. ఇటీవ‌లే యాక్ష‌న్ కింగ్ అర్జున్ సినిమా నుంచి ఎగ్జిట్ అయి నెగిటివ్ అయ్యాడు. అలాగే 'రాజా వారు రాణీ వారు' సినిమాతో ప‌రిచ‌య‌మైన మ‌రో యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా ప‌రిశ్ర‌మ‌లో దూసుకుపోతున్నాడు.

బ్యాక్ టూ బ్యాక్ విజ‌యాల‌తో న‌టుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ని చాటాడు. ఆ ప‌త్రిభ‌తోనే మెగా నిర్మాత అల్లు అర‌వింద్ దృష్టిలో సైతం ప‌డి కొత్త‌ అవ‌కాశాలు ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్ లున్నాయి. అలాగే 'జాతిర‌త్నాలు ' సినిమాతో తెలుగు నాట పాపుల‌ర్ అయిన మ‌రో న‌టుడు న‌వీన్ పొలిశెట్టి.

ఈ సినిమా న‌వీన్ కి ప్ర‌త్యేకమైన ఇమేజ్ ని తీసుకొచ్చింది. అందుకు ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌తో మెప్పించాడు. ఆ వెంట‌నే మ‌రో విజ‌యం న‌వీన్ లో ఉత్సాహాన్ని నింపింది. 'చిచోరే' లాంటి హిందీ సినిమా యువ న‌టుడిగా పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్ర‌స్తుతం న‌వీన్ చేతిలో రెండు..మూడు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి ఏకంగా స్వీటీ అనుష్క‌తోనే రొమాన్స్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.

కెరీర్ ఆరంభంలోనే సీనియ‌ర్ హీరోయిన్ తో రొమాన్స్ అంటే న‌వీన్ ల‌క్కీ గ‌య్ అనే అనాలి. అలాగే అడ‌వి శేషు చాలా కాలంగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా ఇప్పుడిప్పుడే అత‌నికి పేరొస్తుంది. 'గుఢ‌చారి' అత‌నికి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది రిలీజ్ అయిన 'మేజ‌ర్' సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కించుకున్నాడు.

న‌టుడిగా శేషు స్థాయిని పెంచిన చిత్ర‌మిది. ప‌రిశ్ర‌మ‌లో అత‌ని గుర్తింపు ప‌రిధి దాటింది. బ‌డా బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. శేషు కూడా మల్టీ ట్యాలెంటెడ్. ద‌ర్శ‌కుడిగా.. ర‌చ‌యిత‌గా.. న‌టుడిగా... నిర్మాత‌గా రాణిస్తున్నాడు. అలాగే సాప్ట్ వేర్ రంగం నుంచి సినిమా రంగం వైపు వ‌చ్చిన మ‌రో న‌టుడు స‌త్య‌దేవ్. ఎలాంటి బ్యాక‌ప్ లేకుండానే ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చి స‌క్సెస్ అయ్యాడు.

స‌హాయ పాత్ర‌ల‌తో కెరీర్ ప్రారంభించి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రేంజ్ నే అందుకున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'గాడ్ ఫాద‌ర్' లో చిరుకి ప్ర‌త్య‌ర్ధి పాత్ర‌లో ఆద్యంతం మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ హీరోల‌కు స‌రైన ప్ర‌తి నాయ‌కుడిగా సూట‌వుతాడు అన్న పాజిటివ్ వైబ్ క‌నిపిస్తుంది. అంత‌కు ముందు 'బ్లఫ్ మాష్ట‌ర్' లాంటి సినిమా స‌త్య‌దేవ్ కి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

అలాగే మెగా స‌పోర్ట్ తో ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌తిభావంతుడే. మెగా స‌హ‌కారం ఉన్నా? ఎదుగుద‌ల‌లో త‌న కృషి..ప‌ట్టుద‌ల క‌నిపిస్తుంది. న‌టుడిగా త‌న‌ని ఆవిష్క‌రించుకున్న విధానం స్ఫూర్తి దాయ‌కం. న‌టుడిగా బిజీగానే క‌నిపిస్తున్నాడు. ఇంకా మ‌రికొంత మంది యువ న‌టుల్లో భ‌విష్య‌త్ తార‌లుగా మార‌డానికి అవ‌కాశం ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.