Begin typing your search above and press return to search.

హాలీవుడ్ యాక్టర్స్ కు ధీటుగా యంగ్ టైగర్,

By:  Tupaki Desk   |   11 March 2023 1:07 PM GMT
హాలీవుడ్ యాక్టర్స్ కు ధీటుగా యంగ్ టైగర్,
X
అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సందడి మామూలుగా లేదు. అటు రామ్ చరణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ నాటు నాటు పాటకు ప్రచారం కల్పించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. టీవీ షోల్లో పాల్గొంటూ నాటు నాటు పాటను, ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చెర్రీ, తారక్ వేస్తున్న ఔట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఎంతో ఆకట్టుకుంటోంది. సౌత్ ఏషియా ఎక్స్‌లెన్స్ ఈవెంట్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్.. తన స్టైల్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్లూ కలర్ టక్స్ ఔట్ ఫిట్ లో హ్యాండ్సమ్ గా కనిపించాడు.

దక్షిణాసియా నుండి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన నామినీలకు హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసింది. లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ఈ గ్రాండ్ పార్టీకి ఆస్కార్ కు నామినేట్ ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు ఇతర నామినీలు కూడా పాల్గొన్నారు. సౌత్ ఏషియా ఎక్స్‌లెన్స్ పేరులో నిర్వహించిన ఈ పార్టీకి నామినీలతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా యంగ్ టైగర్ వెరీ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. బ్లూ కలర్ టక్స్ ధరించి అటెన్షన్ గ్రాస్ప్ చేశాడు. బ్లూ కలర్ సూట్ లో తారక్ చాలా హ్యాండ్సమ్ గా, హుందాగా కనిపించాడు. లైట్ బ్లూ కలర్ షర్డ్ పై సూట్ ను లేయర్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ కు అనలాగ్ వాచ్ మ్యాన్లీ లుక్ ను తీసుకువచ్చింది. షైనీ డార్క్ బ్రౌన్ కలర్ చెల్సియా బూట్లు ధరించాడు. ట్రిమ్డ్ గడ్డం, షార్ట్ కర్లీ హెయిర్ తో స్టైల్ ను పూర్తి చేశాడు.

తారకరత్న మరణం తర్వాత కుటుంబంతో ఉండిపోయిన జూనియర్.. కాస్త ఆలస్యంగా అమెరికాకు బయల్దేరాడు. తమదైన లుక్స్ తో వావ్ అనిపిస్తున్నాడు. హాలీవుడ్ టైస్ట్ అండ్ స్టైల్ను మ్యాచ్ చేసేలా తనను స్టైల్ గా ప్రెజెంట్ చేసుకుంటున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.