Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ లాస్ ఏంజిల్స్ లోనూ చించేసాడుగా!
By: Tupaki Desk | 9 Jan 2023 4:51 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకూ ప్రేక్షకాభిమానులు సహా మీడియాకి మంచి నటుడిగానే పరిచయం. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచార బరిలోకి దిగి తనదైన వాక్చుతర్యంతో ఆకట్టుకున్నారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత..నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ నడిపించే సత్తా ఉన్న వారని అందరికీ అర్ధమైంది.
ప్రచార సభల్లో తనదైన శైలి వాక్చుతర్యంతో ఆకట్టుకోవడం చిన్న విషయం కాదు. టైగర్ కెరీర్ ఆరంభంలోనే తానో గొప్ప లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా పాపులర్ అయ్యాడు. తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో తనలో దాగిన అన్నిరకాల ప్రతిభల్ని ఒక్కొక్కటిగా తీస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకి మలయాళం మినహా అన్ని భాషల్లోనూ టైగర్ సొంతంగా డబ్బింగ్ చెప్పారు.
అటుపై ' ఆర్ ఆర్ ఆర్' జసాన్ రిలీజ్ సందర్భంగా ఏకంగా జపనీస్ భాషలోనే స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. దీంతో తెలుగు..ఇంగ్లీష్..హిందీతో పాటు జపానీస్ కూడా తెలుసులే అనుకున్నారంతా. కానీ తారక్ లో అంతకు మించిన భాషా నైపుణ్యం దాగి ఉందని మరోసారి లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రూవ్ అయింది. 'ఆర్ ఆర్ ఆర్' ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని డీజీఏ థియేటర్‌లో స్ర్కీనింగ్ అయింది.
ఈ షోకి ఎన్టీఆర్ .. రాజమౌళి సహా అంతా హాజరయ్యారు. ఇదే వేకదిపై తారక్ అమెరికన్ యాసతో అదరగొట్టేసారు. అమెరికన్ వెస్ర్టన్ ప్రజల్ని తన భాషతో సర్ ప్రైజ్ చేసారు. తారక్ లో ఆ స్లాంగ్ చూసి మీడియా సైతం షాక్ అయింది. ఓ తెలుగు నటుడు..భారతీయుడు అమెరికన్ లాంగ్వేజ్ ని ఇరగదీస్తున్నాగా అంటూ అంతా ముక్కుమీద వేలేసుకుని సైలెంట్ అయిపోయారు.
అమెరికన్ యాసతో పశ్చిమాన్ని మరోసారి అబ్బురపరిచాడు. అతను మీడియాతో సంభాషించే సమయమంతా స్వంత భాషలో అద్భుతంగా మాట్లాడాడు. ఆరకంగా పాశ్చాత్య ప్రేక్షకులు సహా భారతీయుల్ని ఆశ్చర్యపరిచారు. దానికి సంబంధించిన ఇంటరాక్షన్ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. దీంతో తారక్ అసాధారణ ప్రతిభావంతుడని కొనియాడుతున్నారు. ఇక అభిమానుల ఆనందానికైతే అవధుల్లేవ్. తారక్ ని అలా చూసి ఇతను మన టైగర్? అని సందేహిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.