Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ ట్విటర్ రికార్డు..టైగర్ తో దూకేయడమే!
By: Tupaki Desk | 19 July 2022 6:30 AM GMT`ఆర్ ఆర్ ఆర్` బ్లాక్ బస్టర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ హాలీవుడ్ ని టచ్ చేసింది. చరణ్ కి వెల్లువలా హాలీవుడ్ అవకాశాలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు హాలీవుడ్ దిగ్గజాలు తమ సినిమాల్లో నటించమని ఓపెన్ గానే ఆఫర్ చేసారు. వీటిపై ఇంకా చరణ్ స్పందించలేదు. దీంతో చరణ్ పాత్ర- ఎన్టీఆర్ పాత్ర మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేయడం వెబ్ మీడియా పనిగా పెట్టుకుంది.
ఎన్టీఆర్ పాత్ర ని చరణ్ రోల్ కి ధీటుగా తీర్చి దిద్ది ఉంటే? తారక్ కి హాలీవుడ్ అవకాశాలు వచ్చేవి కదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే తారక్ ట్విటర్లో నెంబర్ వన్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నారా? హాలీవుడ్ ని మించిన పాపులారిటీ ట్విటర్లోనే దక్కించుకుంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది.
అమెరికాలో `ఆర్ ఆర్ ఆర్` హిందీలో రిలీజ్ అవ్వడం..ఓటీటీలో ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండటంతో `ఆర్ ఆర్ ఆర్` పాన్ వరల్డ్ లో ఫేమస్ అవుతోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజాలంతా ట్విటర్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ గురించి..హీరో ఎలివేషన్ల గురించి చాలా గొప్పగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. చరణ్ కి ఆ రకంగానే హాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి.
ఇక సినిమాలో ప్రధానంగా హైలైట్ అయిన సీన్ తారక్ బ్రిటీష్ కోటల్నిచీల్చడానికి అడవి మృగాలతో ఎంట్రీ ఇచ్చిన సన్నివేశం ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సీన్ గురించి విదేశీయులు సైతం మంత్ర ముగ్దులవతున్నారు. ప్రత్యేకంగా ఆ సీన్ గురించి తమ అభిప్రాయాలు సైతం వెల్లడిస్తున్నారు. ఇలాంటి సన్నివేశం ఇంత వరకూ ఏ సినిమాలో చూడలేదని..అంతకంతకు హైప్ పెంచుతున్నారు.
ఇప్పుడా వీడియో ట్విటర్లో ట్రెండింగ్ లో నిలిచింది. ఏకంగా 10 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఇది ఇండియాలోనే ఓ రికార్డు . ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా సీన్ ట్విటర్లో ఈ రేంజ్ లో సంచలనం నమోదు చేయలేదు.
తొలిసారి ఓ తెలుగు సినిమా..అందులో ఎన్టీఆర్ నటించిన సీన్ ఇంతలా సెన్షేషన్ క్రియేట్ చేయడం ఓ వండర్ గా భావిస్తున్నారంతా. ఈ ఒక్క సన్నివేశం చాలదా? తారక్ రోల్ ని--చరణ్ పాత్రని బ్యాలెన్స్ చేయడానికి అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.