Begin typing your search above and press return to search.
ఫైనల్ గా యంగ్ టైగర్ కూడా రంగంలోకి దిగాడు!
By: Tupaki Desk | 11 Nov 2022 6:34 AM GMTఇండస్ట్రీలో క్రేజ్ వున్నప్పుడే భారీ స్థాయిలో అందివచ్చిన ఆఫర్లని దక్కించుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఈ మధ్య మన హీరోలు, హీరోయిన్ లు సినిమాలతో పాటు క్రేజీ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ లుగా మారి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ బ్రాండ్ లకు ప్రచార కర్తలుగా మారుతున్నారు.
ఓ పక్క సినిమాల్లో సంపాదిస్తూనే క్రేజ్ ని బట్టి కమర్షియల్ బ్రాండ్ లకు ప్రచార కర్తలుగా మారి హోరెత్తిస్తున్నారు. 'పుష్ప' పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ అల్లు అర్జున్ పలు బ్రాండ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో ఫ్రూటీ యాడ్ నుంచి రాపిడో వరకు బన్నీ పలు కమర్శియల్ బ్రాండ్ లకు అంబాసిడర్ గా మారిపోయి వాటికి సంబంధించిన యాడ్ లలో నటించడం మొదలు పెట్టాడు. ఈ రేసులో మొదటి నుంచి ముందు వరుసలో నిలుస్తున్న మహేష్ బాబు ఈ మధ్య కాస్త జోరు తగ్గించడంతో బన్నీ లైన్ లోకి వచ్చేశాడు. 'పుష్ప'తో వచ్చిన క్రేజ్ ని భారీగా వాడుకుంటూ పలు యాడ్ లలో నటిస్తున్నాడు. అయితే 'RRR' భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ క్రేజ్ ని, ఫ్యాన్ బేస్ ని దక్కించుకుని వార్తల్లో నిలిచారు. అయితే ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ ని బన్నీ తరహాలో కమర్షియల్ యాడ్ లకు వాడు కోలేకపోతున్నారని ఫ్యాన్స్ గత కొన్ని నెలలు గా ఫీలవతున్నారు. ఇటీవలే రామ్ చరణ్ 'RRR' క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ కమర్శియల్ యాడ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వరుసగా వాటిల్లో నటించాడు కూడా.
అయితే ఎన్టీఆర్ మాత్రం తన 30 వ ప్రాజెక్ట్ ప్రారంభం కోసం ఎదురుచూస్తూ 'RRR' క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. గత ఐదారు నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసమే ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఎట్టకేలకు కమర్షియల్ యాడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తను కూడా రంగంలోకి దిగేశాడని తెలిసింది. ఫాంటా యాడ్ లో ఇంతకు ముందు నటించిన ఎన్టీఆర్ ఈ సారి భారీ డీల్ ని కుదుర్చుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం ఈ యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడని తెలిసింది.
ఈ కమర్షియల్ యాడ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇదిలా వుంటే ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ డిసెంబర్ లో పట్టాలెక్కడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశం వుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.