Begin typing your search above and press return to search.
మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే: మెగాస్టార్
By: Tupaki Desk | 2 May 2022 3:38 AM GMTప్రపంచంలో ఏ రంగంలోనైనా కార్మికులకు ఒక నిర్ణీతమైన పనిగంటలు ఉంటాయి. వాళ్లు తమ పనిని 8 గంటలపాటు చేస్తారు. ఆయా పనులను బట్టి ఆ 8 గంటల్లోనే ఎంతో కష్టపడేవారు ఉంటారు. కానీ అలాంటి ఒక నిర్ణీతమైన సమయమనేది లేకుండా పని చేసేది ఒక్క సినిమా కార్మికులు మాత్రమే అంటూ 'మేడే' సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. హైదరాబాద్ - యూసఫ్ గూడాలో నిన్న జరిగిన సినీ కార్మికోత్సవంలో ప్రసంగిస్తూ చిరంజీవి ఈ మాట అన్నారు.
'మేడే' అనేది కార్ముఖులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ. కానీ సినిమా కార్మికులకు పండుగలు .. పబ్బాలు ఏమీ ఉండవు. వాళ్లు ఎక్కడెక్కడో షూటింగ్స్ లో ఉంటారు. అవసరాల్లో .. ఆపదల్లో కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. ఆ విషయాలు తెలిసినప్పటికీ వెంటనే స్పందించలేని పరిస్థితులు ఉంటాయి.
ముందుగా షూటింగ్ .. ఆ తరువాతనే మిగతా విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. నాకు బాగా గుర్తు .. ఒక షూటింగులో నూతన్ ప్రసాద్ గారు గాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కుర్చీలో కూర్చునే క్లోజప్ షాట్స్ లో నటించారు.
మిగతా రంగాల్లో కార్మికులు కోలుకోవడానికి కొంత సమయం ఇస్తారు .. కానీ ఇక్కడ అలా కుదరదు. డైరెక్టర్ కేబీ తిలక్ గారి భార్య చనిపోయారు .. అప్పుడు ఆయన షూటింగులో ఉన్నారు. ఒక పది నిమిషాల తరువాత మళ్లీ మొదలుపెడదామని అన్నారు.
అల్లు రామలింగయ్య గారు తల్లి చనిపోయిన దుఃఖంలో కూడా షూటింగుకి వెళ్లారు. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా షూటింగు సమయంలో నాకు 103 ఫీవర్ వచ్చింది .. ఆ జ్వరంతోనే డాన్స్ చేశాను. ఆ తరువాత 15 రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది.
ఈ మధ్య నేను 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగు కోసం హైదరాబాద్ .. ముంబై అదే పనిగా తిరగవలసి వచ్చింది. నిజానికి నేను చాలా అలసిపోయాను. కానీ ఆ విషయం చెబితే షూటింగు ఆగిపోతుంది. సినిమాను నమ్ముకున్న కార్మికులకు ఇలాంటి కష్టాలు ఎన్నో ఉంటాయి. అందువల్లనే వారి నిత్వసర వస్తువుల పంపిణీ .. వ్యాక్సినేషన్ ఇప్పించే విషయంలో నేను బాధ్యత తీసుకున్నాను.
పరిశ్రమలోని కష్టాలను చూస్తూ వచ్చినవాడిని. మీలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను .. మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే .. ఎప్పుడూ మీ కోసం పనిచేసేవాడే. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించారు.