Begin typing your search above and press return to search.
గీతాగోవిందం పైరసీ..గుంటూరు కుర్రాళ్లు బుక్!
By: Tupaki Desk | 12 Aug 2018 10:28 AM GMTగొప్పలు చెప్పుకోవాలన్న తాపత్రయం గుంటూరు కుర్రాళ్లను అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. బడాయి చూపేందుకు చేసిన ఎదవ పనిని వారికి కష్టాల్లోకి నెట్టటమే కాదు.. కేసులు మెడకు చుట్టుకునేలా చేశాయి. త్వరలో విడుదల కానున్న గీతాగోవిందం మూవీ మీదున్న అత్యుత్సాహం ఇప్పుడు కొత్త తిప్పలు తెచ్చి పెట్టింది.
గుంటూరుకు చెందిన రెండు ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన పలువురు బీటెక్ విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం సంచలనంగా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న గీతాగోవిందం మీద విపరీతమైన బజ్ నెలకొన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఈ చిత్రాన్ని ఎడిటింగ్ చేసే సమయంలో సినిమాకు సంబంధించిన కీలకమైన కొన్ని భాగాన్ని తస్కరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ దృశ్యాలు కొన్ని గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థుల చేతికి రావటం.. వెంటనే వాటిని వారు తమ స్నేహితులకు షేర్ చేశారు.
అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులు జరిపిన దర్యాప్తులో గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఆ చిత్రాన్ని షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. మొత్తానికి హైదరాబాద్ లో ఎడిటింగ్ సమయంలో బయటకు పొక్కిన సన్నివేశాల్ని తమ వద్దకు వచ్చినంతనే వాటిని డిలీట్ చేయకుండా అత్యుత్సాహంతో స్నేహితులకు షేర్ చేసినందుకు పది మంది వరకూ పోలీసుల అదుపులోకి వెళ్లాల్సిన పరిస్థితి. వాట్సాప్ లో వచ్చిన ప్రతి సమాచారాన్ని ఇష్టారాజ్యంగా షేర్ చేసుకోవటం ఎంత ప్రమాదమో ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.