Begin typing your search above and press return to search.

యూత్.. కేరాఫ్‌ మ‌హాన‌టి థియేట‌ర్లు

By:  Tupaki Desk   |   9 May 2018 7:27 AM GMT
యూత్.. కేరాఫ్‌ మ‌హాన‌టి థియేట‌ర్లు
X
మ‌హాన‌టి సినిమా కోసం సావిత్రి ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. ఆ రోజు రానే వ‌చ్చింది. థియేట‌ర్లన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇప్ప‌టికే పాజిటివ్ టాక్ వ‌చ్చేసింది. సావిత్రి ఫ్యాన్స్ అన‌గానే అంద‌రూ తాత‌లు, అమ్మ‌మ్మ‌లే అనుకున్నారు. సావిత్ర కాలం నాటి వాళ్లే ఈ సినిమా చూస్తార‌ని కూడా విమ‌ర్శించారు. కానీ ఈ రోజు థియేట‌ర్లకు వ‌చ్చిన వారిని చూస్తే ఆశ్చ‌ర్య‌ప‌డ‌డం ఖాయం. థియేట‌ర్ల నిండా తొంభై అయిదు శాతం మంచి యూత్ మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.

నాగ అశ్విన్ న‌మ్మ‌కం ఊహ నిజ‌మ‌య్యాయి. సావిత్రి బ‌యోపిక్‌ను సినిమాగా తీస్తే ముస‌లోళ్లే థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని మొద‌ట్లో విమ‌ర్శించిన వాళ్ల సంఖ్య త‌క్కువేమీ కాదు. కానీ ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ మాత్రం సావిత్రి ఛార్మింగ్‌ను ఆమె జీవితంలో సినిమా క‌థ‌ను మించిపోయే మ‌లుపుల‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న తారాగాణంతో సినిమా తీస్తే త‌ప్ప‌కుండా హిట్ట‌వుతుంద‌ని భావించాడు. మంచి క‌థ మంటి న‌టీన‌టులు మ‌హాన‌టి సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. అనుకున్న‌ట్టే యూత్‌ను కూడా సినిమా ఆక‌ర్షించింది. సావిత్రి జీవితంలో ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు ఆస‌క్తితో వ‌చ్చిన‌వాళ్ల సంఖ్య కూడా త‌క్కువేమీ కాదు.

త‌మ అమ్మ‌నాన్న త‌రంనాటి మ‌హాన‌టి గురించి ఇప్ప‌టి యూత్‌లోనూ ఆస‌క్తి ఉంద‌ని ఈ సినిమాకు వ‌చ్చే వారిని చూస్తే అర్థ‌మైపోతుంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ టాక్స్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ్‌. సావిత్రిగా న‌టించిన కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఎవ్వ‌రైనా ప‌డిపోవ‌డం ఖాయం అంటున్నారు సినిమాను చూసిన‌వాళ్లు. అలాగే స‌మంత పాత్ర కూడా త‌క్కువేమీ కాద‌ట సెకండాఫ్ ఆమె పాత్రా సావిత్రి పాత్ర‌తో స‌మానంగా సాగుతుంద‌ట‌. విజ‌య దేవ‌ర‌కొండ దుల్క‌ర్ స‌ల్మాన్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇలా అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల‌కూ స‌రైన న్యాయం చేశార‌ని ఓవ‌ర్సీస్ టాక్‌.