Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ స్టయిల్ కావల్సిందేనా...
By: Tupaki Desk | 4 Oct 2015 11:30 AM GMTహీరోల్ని ఇమ్మిటేట్ చేయాలనుకుంటే నక్కను చూసి వాతలు పెట్టుకున్నట్టే. హీరోల స్టయిల్స్ - మేనరిజం - ఇతరత్రా మెయింటెనెన్స్ చూసి వెర్రెత్తిపోయే యూత్ కి కొదవేం లేదు. అయితే వాస్తవాల్ని తెలుసుకోకుండా అలాంటి ప్రయత్నాలు చేస్తే ఉన్నదంతా ఊస్టింగే. లేటెస్టుగా నాన్నకుప్రేమతో చిత్రం కోసం ఎన్టీఆర్ న్యూలుక్ లో కనిపించారు. గుబురు గడ్డం - కోరమీసం.. పంజాబీ స్టయిల్ హెయిర్ కట్.. ఇవన్నీ చూసి యూత్ పిచ్చెత్తిపోతున్నారు.
ఎన్టీఆర్ ను చూసి ఆ స్టయిల్ చేయించుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. కాని బాగా జుట్టు పెంచి ఆ కటింగ్ చేయించుకోవాలంటే మాత్రం షుమారు రెండు వేల రూపాయల ఖర్చువుతోంది. రోడ్ సైడ్ పార్లర్ లో ఇలాంటి కట్ చేయలేకపోతున్నారు. పైగా ఇలాంటి కటింగ్ చేయాలంటే ముంబై నుంచి ఫ్యాషన హెయిర్ స్టయిలిస్టులు దిగాల్సిందే . ఇంచు ఇంచుకి వాళ్లు వేలల్లో బిల్లు వేసి చావమోదేస్తారు. జేబుల్లో ఉన్నదంతా ఊడ్చేస్తారు.
వాళ్లంతా ప్రొఫెషన ల్స్.. ఇలాంటి హెయిర్ డిజైన్‌ల కోసం వాళ్లు ఉపయోగించే ఐటెమ్స్ ఖర్చు కూడా అంతే ఎక్కువ. అందుకే పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించుకోవాల్సిందే. అయినా కోట్లలో పారితోషికాలు అందుకునే వాళ్లెక్కడ. పదికి పరకకి ఉద్యోగాలు చేసుకునే సామాన్యులకు , నాన్న పెడితేనే కానీ తిండి దొరకని ఆవారాగాళ్లకు అలాంటి స్టయిలింగ్స్ ఎందుకులేండి.. అభిమానం ఓకె గాని.. మరీ ఇలా అంటే కష్టమేగా..