Begin typing your search above and press return to search.

కామెంట్: ఐష్‌ ఫోజులపై అమ్మాయిల ఫీలింగ్

By:  Tupaki Desk   |   14 Oct 2016 5:30 PM GMT
కామెంట్: ఐష్‌ ఫోజులపై అమ్మాయిల ఫీలింగ్
X
ప్రకంపనాలు రేపడం అనే పదానికే కొత్త అర్ధం చెప్పింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. అసలు 40 ఏళ్ళ వయస్సులో ఇండియాను షేక్ చేస్తున్న హీరోయిన్ అంటే ఆమె అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఏజ్ గ్రూప్ లో ఉన్న మిగిలిన భామలందరూ అమ్మమ్మల్లా తయారయ్యారు. కాని ఐష్‌ మాత్రం.. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాతో రచ్చలేపేస్తోంది. అయితే ఒక ఏజ్ బార్ హీరోయిన్ ఇలా చేస్తుంటే అబ్బాయిలు తట్టుకోలేకపోతున్నారు కాని.. అమ్మాయిలు ఏమంటున్నారు మరి?

అసలు ఐశ్వర్య ఎంత హాటుగా ఘాటుగా నటించినా కూడా అది ఆమె ఇష్టం. కాబట్టి దీని గురించి ఎవ్వరూ ఎటువంటి ఎక్సప్లెనేషన్లు ఇవ్వక్కర్లేదు. కాకపోతే అమ్మాయిలు మాత్రం.. ఐష్‌ ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నాం అంటున్నారు. ఏజ్ పెరిగినా కూడా ఫిట్నెస్ మెయిన్టయిన్ చేస్తూ గ్లామర్ తో అదరగొట్టేస్తూ ఐష్‌ ఒక సంచలనానికి తెరలేపింది అనేది వారి ఫీలింగ్. ఇకపోతే 40 ఏళ్ళ ఐష్‌ 30 ఏళ్ళ రణబీర్ తో రొమాన్స్ ఏంటి అంటే.. షారూఖ్‌ ఖాన్ వంటి 50 ఏళ్ళ స్టార్.. 26 ఏళ్ల అనుష్క శర్మను రొమాన్స్ చేస్తే లేనేది.. ఐష్‌ చేస్తే వచ్చిందా? అంటున్నారు ఆడ లేడీస్. ఫెమినిజం.. జెండర్ ఈక్వాలిటీ.. మట్టీ మశానం అనే మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు ఐష్‌ ను సపోర్టు చేయడమే కాదు.. అసలు ఆమెను చూసి నేర్చుకోవాలి అని సెలవిచ్చారు.

అసలు ఐష్‌ ఎంత హాటుగా కనిపించినా కూడా.. ప్రస్తుతానికి ఈ సినిమాలో ఏదో హీరోయిన్ పాత్ర చేస్తోంది కాని.. ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ కొత్తరకం పాత్రలనే ఫిలిం మేకర్లు ఆమెకు ఆఫర్ చేయాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ జజ్బా అండ్ సారబ్జిత్ ఫ్లాపయ్యాయ్ కాబట్టి.. కొన్ని రోజులు అలాంటి స్ర్కిప్టులను ఐష్‌ బ్రేక్ ఇచ్చిందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/