Begin typing your search above and press return to search.
కామెంట్: యూట్యూబ్ పిచ్చి భరించలేం
By: Tupaki Desk | 28 Jun 2017 7:43 AM GMTసోషల్ మీడియా వచ్చింది డిజిటల్ మీడియాలో ఒక విప్లవం తీసుకువచ్చింది. దీన్ని ఎవరు కాదనలేని సత్యం. యూట్యూబ్ వలన స్టార్ నటులు అయన వారు కూడా ఉన్నారు. ఎవరి వాదనలు వారు చెప్పడానికి వాళ్ళ వాళ్ల టాలెంట్ చూపించుకోవడానికి ఒక మంచి వేదిక. కానీ ప్రతి విషయానికి మంచితో పాటు కొంత చెడు కూడా ఉంటుంది. గొప్ప గొప్ప విషయాలు మనకు అందుబాటులో ఉంచుతున్న ఇంటర్నెట్లో కూడా... సమాజ సామరస్యం దెబ్బ తీసే విషయాలుకు లోగిలిగా మారింది ఈ యుట్యూబ్. దీన్ని అదుపులో ఉంచడానికి ఒక చట్టం అంటూ ఏది లేదు.
ఒక పత్రికలో ఒక విషయం రాయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ వార్తలో ఎంత నిజం ఉంది ఆ వార్త జనాలుకు అవసరమా లేదా అని నిర్ణయానికి వచ్చు ప్రింట్ చేస్తారు అలాగే టివి పోగ్రాములు - సినిమాలు - పుస్తకాలు - వెబ్ సైట్లు కూడా. ఇలా ప్రతిదానికి ఒక నియమ నిబంధనలుకు అనుసరించి నడుస్తాయి. కానీ ఇంటర్నెట్ లో ఈ యుట్యూబ్ కు అటువంటి నియమాలు కానీ చట్టాలు కానీ లేవు. కేవలం మార్కెట్ చేసుకుందాం అందరి అటెన్షన్ కోసం జనాలలో ఏదో ఒక విధంగా గుర్తింపు సంపాదించుకుందాం అనే ఆలోచనతో కొందరు యూట్యూబ్ లో చెత్తను కూడా పెట్టేస్తున్నారు. పేరున్న ఒక సెలబ్రిటీపై ఏదో తప్పుగా మాట్లాడటం.. వీళ్ళు స్టార్స్ లా ఫీల్ అయిపోవడం కొంతమంది సక్సెస్ లేని సెలబ్రిటీలకు అలవాటుగా మారింది.. ఏదో ఒకటి చెత్తగా చెప్పేస్తున్నారు వాళ్ళ గురించి.
ఈ మధ్య మీరు చూసే ఉంటారు కొన్ని వెబ్ ఛానెల్స్ కొందరి దగ్గరకు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకొన్ని ఏదో ప్రజలకు గొప్ప సమాచారాన్ని ఇస్తున్నాం అనే భావనలో ఉన్నారు. ఎవరిని ఇంటర్వ్యూ చేయాలో ఎందుకో చేస్తున్నారో ఆ చేసే వాళ్ళకి తెలియదు ఏమి చెబుతున్నామో ఆ చెప్పేవారికీ తెలియటం లేదు. హీరోలు పై ప్రొడ్యూసర్ల పై ఏవో మాట్లాడటం సినిమా డైరెక్టర్లు పై నచ్చినట్లు మాటలాడటం మామూలు అయిపోయింది. సినిమా వాళ్ళు గురించి ఎలాంటివి చెబితే తొందరగా జనాలు నమేస్తారు కాబట్టి సదరు వెబ్ చానల్స్ కూడా వాటికి సెన్సేషనల్ హెడ్డింగులు పెట్టేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. వీళ్ళ పిచ్చి ప్రపంచం దాటితే పరవాలేదు కానీ ఇలా పాతాళానికి పడిపోతే ఎలా భరించగలం చెప్పండి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/