Begin typing your search above and press return to search.

'హిట్ 2' టీజర్‌ పై యూట్యూబ్ వివాదం.. అడివి శేష్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 9:30 AM GMT
హిట్ 2 టీజర్‌ పై యూట్యూబ్ వివాదం.. అడివి శేష్ క్లారిటీ..!
X
వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ "హిట్: 2". రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో తక్కువ వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో నిలిచింది. టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అయితే 'హిట్: ది సెకండ్ కేస్' మేకర్స్ యూట్యూబ్ షాక్ ఇచ్చింది. వయస్సు పరిమితి విధించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ జాబితా నుండి టీజర్‌ ను తొలగించింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ వివాదంపై తాజాగా హీరో అడివి శేష్ వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందో చెబుతూ.. టీజర్‌ ను ఎలా యాక్సెస్ చేయాలో వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇలాంటివి జరుగుతాయని టీమ్ ముందే ఊహించిందని.. అంతా సవ్యంగా జరుగుతుందన్న నమ్మకం తమకుందని పేర్కొన్నాడు.

'హిట్ 2' టీజర్ ను డైరెక్టర్ శైలేష్ కొలను చూపించినప్పుడే ఇలాంటి రోజు వస్తుందని అనుకున్నాను. అనుకున్నట్లుగానే వచ్చింది. యూట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో నుంచి టీజర్ ను తొలగించింది. మూడు నాలుగు రోజులు ట్రెండింగ్ లో ఉన్నదాన్ని సడన్ గా తీసేసి ఏజ్ రిస్ట్రిక్ట్ చేసారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో సైన్ ఇన్ చేసి 18 ఏళ్ళ పైబడిన వారని ప్రూవ్ చేసుకుంటే.. 'హిట్ 2' టీజర్ ని చూడొచ్చు అని అడివి శేష్ తెలిపారు.

వైలెన్స్ ఉన్న కంటెంట్ కాబట్టి అలా జరిగింది. కానీ సినిమాకు ఇదే కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ ఉంది. అప్పటికీ మా ట్వీట్స్ లోనే ఇది చిన్న పిల్లలకు కాదు అని సూచన కూడా ఇచ్చాం. ప్రభాస్ గారు అన్నట్లు లైఫ్ లో ఎప్పుడూ వైలెన్స్ కాదు.. కొంచం రొమాన్స్ కూడా ఉండాలి కదా. అందుకే 'ఉరికే ఉరికే' అనే అమేజింగ్ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం. సిద్ శ్రీరామ్ గోల్డెన్ వాయిస్ తో ఈ గోల్డెన్ సాంగ్ చాలా బాగుంటుంది. తప్పకుండా చుడండి అని శేష్ చెప్పుకొచ్చారు.

"హిట్ 2" టీజర్ యూట్యూబ్‌ లో దాదాపు 9 మిలియన్ల వ్యూస్ అందుకుంది. యూట్యూబ్ యాక్షన్ తీసుకునే వరకు నంబర్ 1 ట్రెండింగ్‌ లో ఉంది. అయితే, చిత్ర బృందం యూట్యూబ్ నిర్ణయాన్ని గౌరవించి ప్రతిదీ పాజిటివ్ నోట్ లో తీసుకుంది. ఈ క్రమంలో రేపు (నవంబర్ 10) ఉదయం 11.07 గంటలకు ఎంఎం శ్రీలేఖ స్వరపరిచిన 'ఉరికే ఉరికే' వీడియో సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

"HIT 2" చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా.. గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా వర్క్ చేసారు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.