Begin typing your search above and press return to search.
ఓటీటీ వెబ్ సిరీస్ లకు ధీటుగా యూట్యూబ్ సిరీసులు..!
By: Tupaki Desk | 16 May 2021 12:30 AM GMTమారుతున్న కాలంతో పాటుగా ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి. వినోదం కోసం ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని ఆడియన్స్ కోరుకుంటున్నాడు. ఒకప్పుడు థియేటర్స్ లో సినిమాలు - టీవీల్లో సీరియల్స్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్స్ లో వెబ్ సిరీస్ లు చూడటానికి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కంటెంట్ ని వారికి అందించడానికి పోటాపోటీగా కొత్త కొత్త ఫ్లాట్ ఫార్మ్స్ పుట్టుకొచ్చాయి. యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటుగా ఓటీటీలు - ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో వచ్చే వెబ్ కంటెంట్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గతేడాది లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన జనాలు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ని చూస్తూ కాలక్షేపం చేశారు. ఈ క్రమంలో ఓటీటీ వెబ్ సిరీస్ లకు ధీటుగా యూట్యూబ్ సిరీసులు కూడా క్రేజ్ తెచ్చుకోవడం గమనార్హం. ఒకప్పుడు యూట్యూబ్ లో సినిమాలు వీడియో సాంగ్స్ - షార్ట్ ఫిల్మ్స్ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించేవారు.
అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ లకు పోటీగా యూట్యూబ్ లో రకరకాల జోనర్ సిరీస్ లు అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని సిరీస్ లైతే ఓటీటీలలో వచ్చే వెబ్ కంటెంట్ కంటే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటూ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అంతేకాదు దీనికి తగ్గట్టే రెవెన్యూ కూడా అదే రేంజ్ లో వస్తున్నట్లుగా మేకర్లు చెబుతున్నారు. వీటి వల్ల వచ్చిన క్రేజ్ తో ఆ సిరీస్ లకు వర్క్ చేసే టెక్నిషియన్స్ కు.. అందులో నటించే నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.