Begin typing your search above and press return to search.
నెట్టింట వైరల్.. వేలం వెర్రిగా వెంటపడుతున్న స్టార్స్!
By: Tupaki Desk | 10 Jun 2022 12:30 PM GMTసోషల్ మీడియాలో పాపులర్ అయితే పంటపండినట్టే.. బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయ్యారా?.. అయితే అలాంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలని ఏర్పాటు చేయమంటున్నారు స్టార్ హీరో లు. అలాంటి వారు పక్క రాష్ట్రంలో వున్నా.. అమెరికాలో వున్నా సరే వారి వెంటపడుతున్నారు. వారిని ప్రత్యేకంగా పిలిపించుకుని వారితో తమ సినిమా రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా రీల్స్ చేస్తున్నారు. వారి క్రేజ్ ని తమ సినిమాకు వాడుకోవాలని, తద్వారా వారి ఫాలోవర్స్ ని తమ సినిమాల కోసం థియేటర్లకు రప్పించాలని నానా పాట్లు పడుతున్నారు.
ప్రత్యేక ఇంటర్వ్వూలు కూడా ప్లాన్ చేస్తూ నిర్మాతలకు మరింత బడ్జెట్ పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్స్ చేస్తున్న ఈ పనుల వల్ల నిర్మాతలకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రత్యేకంగా హోటలలో సూట్ లు బుక్ చేయడం, భారీగా ఖర్చు చేయడం వంటివి చేయాల్సి వస్తోంది. అంతే కాకుండా సదరు స్టార్స్ తో రీల్స్, ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తున్న వారికి ప్రత్యేకంగా రెమ్యునరేషన్ అందిస్తూనే జీఎస్టీని కూడా కట్టించేస్తున్నారు. ఈ మధ్య ఈ కొత్త ట్రెండ్ మొదలైంది.
యూట్యూబ్ లో పాపురల్ అయింది ఓ యువతి. వెస్ట్రన్ ఇంగ్లిష్ మాట్లాడుతూ అదరగొట్టేస్తోంది. తనకున్న ఫాలోవర్స్ కారణంగా పాపులర్ గా మారి సెలబ్రిటీల దృష్టిలో పడింది. ఇంకేముంది మన వాళ్లు ఊరికే వుంటారా? సినిమా రిలీజ్ కు ముందు ఆ అమ్మాయితో రీల్స్ చేయాల్సిందే.. అంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ స్టార్ కు నిర్మాత చేత ఫ్లైట్ టిక్కెట్ లు వేయించి మరి హైదరాబాద్ రప్పిస్తున్నారు. స్టార్ హోటల్ లో సూట్ లు బుక్ చేస్తున్నారు.
రీల్స్ చేస్తున్నారు. ఇవి ఎంత వరకు వైరల్ అవుతున్నాయి? .. ఈ రీల్స్ వల్ల ఎన్ని టికెట్ లు తెగుతున్నాయన్నది మాత్రం ఎవరికి తెలియడం లేదు. కానీ తను కావాలి. తను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలి.. తనతో రీల్స్ చేయాలి. రీసెంట్ గా పాన్ ఇండియా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న స్టార్ హీరో వరకు ప్రతీ ఒక్కరు సదరు యూట్యూబ్ స్టార్ వెంట పడుతున్నారు.. తమ సినిమా రిలీజ్ కు ముందు భారీగా పారితోషికం అందించి మరీ రీల్స్ చేస్తున్నారు. ఇది చాలా మందికి విడ్డూరంగా అనిపిస్తోంది.
ఇక ఇటీవల ప్రత్యేక యాసతో యాంకర్ గా పాపులర్ అయిన ఓ వ్యక్తి తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయించుకుని ఆ వీడియోని నెట్టింట విడుదల చేశాడో స్టార్ హీరో. రీ సెంట్ గా తను నటించిన ఓ సినిమా థియేటర్లలోకి నలె రోజుల క్రితం వచ్చింది. నెల తిరక్కుండానే ఓటీటీలో పే పర్ వ్యూ పద్దతిలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో స్టార్ హీరో పట్టుబట్టి మరీ ఓ వ్యక్తితో ఇంటర్వ్యూ చేయించుకున్నారు. సదరు వ్యక్తి ప్రత్యేక యాసలో మాట్లాడుతూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అతనితో ఇంటర్వ్యూ గమ్మత్తుగా వుండటమే కాకుండా సినిమా ప్రచారానికి ప్లస్ అవుతుందని భావించాడు స్టార్ హీరో. దాంతో సదరు వ్యక్తితో ఇంటర్వ్యూని ఏర్పాటు చేసుకున్నాడు.
దీనికి ఖర్చు మొత్తం నిర్మాతదే. ఇంటర్వ్యూ చేసినందుకు గానూ జీఎస్టీతో కలిపి పారితోషికం కింద సదరు వ్యక్తికి అక్షరాలా మూడున్నర లక్షలు నిర్మాత చెల్లించారు. ఇది ఆయనకు అదనపు భారమే అయినా స్టార్ హీరో అడిగాడు కాబట్టి తప్పదు అని ఇష్టం లేకపోయినా నిర్మాతలు ఖర్చు చేశారు. ఇది ఇప్పడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పబ్లిసిటీ పరంగా భారీగా ఖర్చు చేస్తున్న నిర్మాతలకు యూట్యూబ్ స్టార్స్ తో స్టార్ హీరోల రీల్స్, ప్రత్యేక యాంకర్ తో ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం ఖర్చు చేయాల్సి రావడం కొత్త తలనొప్పిగా మారిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.