Begin typing your search above and press return to search.
YRF 50 గ్రాండ్ మాస్టర్ ప్లాన్! 1000 కోట్లతో భారీ సినిమాలు!!
By: Tupaki Desk | 6 Feb 2021 11:30 PM GMTబాలీవుడ్ లో ఐదు దశాబ్ధాల చరిత్రతో గొప్ప సంచలనాలు సృష్ఠించిన అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఐదు కొత్త చిత్రాలను ప్రకటించనుంది. అత్యంత వైభవంగా జరిగే ఓ భారీ ఈవెంట్ లో GRAND YRF 50 ప్రణాళికను ఆవిష్కరించనుంది. ఆ మేరకు క్లోజ్ సోర్సెస్ నుంచి వివరం అందింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) తన 50 వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ తరహా భారీ ప్రణాళికతో ముందుకొచ్చిందని తెలుస్తోంది. 1970 లో ఈ ఐకానిక్ ప్రొడక్షన్ హౌస్ ని యష్ చోప్రా స్థాపించారు. ఇది 2020 నాటికే 50 ఏళ్ళకు చేరుకుంది. కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా దాని యజమాని ఆదిత్య చోప్రా YRF 50 వేడుకలను వాయిదా వేశారు. ఎట్టకేలకు ఒక తేదీ ఫిక్స్ చేశారని తెలిసింది.
YRF 50 ప్లాన్ ను ఫిబ్రవరి-ఎండ్ లో లేదా 2021 మార్చి ప్రారంభంలో ఆవిష్కరించనున్నారని ప్రముఖ బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ముంబై సహా మహారాష్ట్రలో ఫిబ్రవరి 1 నుండి థియేటర్లు తిరిగి తెరవడమే కాకుండా 100 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో యష్ రాజ్ సంస్థ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆదిత్య చోప్రా YRF 50 మాస్టర్ ప్లాన్ ను వెల్లడించడం అనేది బాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యవహారం. థియేటర్లు ఇప్పుడు వంద శాతం ఆక్యుపెన్సీతో పనిచేస్తుండటంతో YRF ప్రతిష్టాత్మక వేడుక ప్రణాళికను రూపొందిస్తోంది. మహమ్మారి సమయంలో నాలుగు కొత్త పెద్ద చిత్రాలను షూట్ మోడ్ లో ఉంచిన ఏకైక స్టూడియో యష్ రాజ్ సంస్థ మాత్రమేనని తెలిసింది.
“ఆదిత్య చోప్రా తన ప్రణాళికకు కట్టుబడి ఉన్నాడు. ప్రొడక్షన్ హౌస్ థియేటర్ యజమానులకు భరోసానిస్తూ తన సినిమాలు ఏవీ OTT లో విడుదల చేయకుండా నిలబడి ఉంది. ఇప్పుడు YRF సినిమాలు పెద్ద స్క్రీన్ కోసం మాత్రమే అని ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఈ ప్రకటన ఖచ్చితంగా థియేటర్లలో చేయాలన్నది ప్లాన్. అంతేకాదు.. ఈ ప్రకటన విధానం.. స్కేల్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. చాలా ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక ఆది`` అని ఓ సోర్స్ తెలిపింది.
వైఆర్‌ఎఫ్ 50 ప్రకటనలో పృథ్వీరాజ్- షంషేరా- జయేశ్ భాయ్ జోర్దార్- బంటీ ఔర్ బబ్లి 2- సందీప్ పిర్ పింకీ ఫరార్ చిత్రాల గురించి మరింత సమాచారం ఇస్తారని భావిస్తున్నారు. భారీ వేదికపై ఆదిత్య చోప్రా తన మైండ్ లో ఉన్న ఇతర పెద్ద ఆలోచనలను కూడా వెల్లడిస్తారని తెలిసింది. ఇది భారతదేశంలోని అత్యంత పురాతనమైన అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ తమ 50వ యానివర్శరీని ప్రతిష్ఠాత్మకంగా భావించింది. అందుకే అనేక ప్రకటనలు ఈ సంస్థ నుంచి వెలువడతాతాయని అంతా భావిస్తున్నారు. ఈ ఆలోచనలన్నింటికీ బ్లూప్రింట్ ఇప్పటికే ఆదిత్య చోప్రా సిద్ధం చేశారు. కాబట్టి గొప్ప ఆలోచనలు తప్ప మరేమీ ఆశించవద్దు ”అని సోర్స్ వెల్లడించింది.
అర్జున్ కపూర్ - పరిణీతి చోప్రా నటించిన సందీప్ పిర్ పింకీ ఫరార్ 2020 మార్చి 20 న విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. థియేటర్లలోకి వచ్చే తొలి వైఆర్.ఎఫ్ చిత్రం ఇదేనని భావిస్తున్నారు. సందీప్ పిర్ పింకీ ఫరార్ ముందు విడుదలయ్యే మరో చిత్రం `బంటీ ఔర్ బబ్లి 2`. ఇది 2005 లో వచ్చిన కామెడీ హిట్ బంటీ ఔర్ బబ్లికి సీక్వెల్ .. సైఫ్ అలీ ఖాన్- రాణి ముఖర్జీ- సిద్ధాంత్ చతుర్వేది - శార్వారి వాగ్ తదితరులు నటించారు.
రణ్‌వీర్ సింగ్ నటించిన `జయేశ్ భాయ్ జోర్దార్` చాలా కాలం నుండి సిద్ధంగా ఉంది. 2021 లో థియేటర్లలోకి రావడం ఖాయం. ఇంతలో పృథ్వీరాజ్ అనే చారిత్రాత్మక చిత్రం రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్- సంజయ్ దత్- మనుషి చిల్లార్ - సోను సూద్ ఇందులో నటించారు. డాక్టర్ చంద్రప్రకేష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్- సంజయ్ దత్ - వాణీ కపూర్ నటించిన షంషేరా YRF నుంచి వస్తున్న మరో భారీ చిత్రం.
ఈ చిత్రాలతో పాటు షారుఖ్ ఖాన్- దీపికా పదుకొనే - జాన్ అబ్రహాం ప్రధాన పాత్రల్లో నటించిన పఠాన్ చిత్రీకరణను కూడా వైఆర్.ఎఫ్ సంస్థ ప్రారంభించింది. అదే సమయంలో విక్కీ కౌశల్ కథానాయకుడిగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన చిత్రం కూడా సెట్స్ పైకి వెళ్లింది. అలాగే సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 మార్చిలో చిత్రీకరణకు వెళుతుంది. ఈ సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. యష్ రాజ్ సంస్థ ప్లాన్ ని పరిశీలిస్తే దాదాపు 1000- 1500 కోట్ల మేర ఓవరాల్ బడ్జెట్ తో భారీ ప్రణాళికల్ని విస్తరిస్తోందని ఆ మేరకు డబ్బును కుమ్మరించనుందని అర్థమవుతోంది.