Begin typing your search above and press return to search.
'యాత్ర' లో జగన్.. సస్పెన్స్ కు తెర
By: Tupaki Desk | 18 Jan 2019 11:11 AM GMTవైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'యాత్ర' చిత్రం షూటింగ్ ముగిసింది. ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించాడు. ఇదో డాక్యుమెంటరీ టైప్ లో కాకుండా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం రాజశేఖర్ రెడ్డి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో జగన్ పాత్రను ఒక యువ స్టార్ హీరో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
జగన్ పాత్ర గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జగన్ పాత్ర ఉంటుంది. అయితే జగన్ పాత్రను ఎవరో పోషించడం లేదు. అంటే స్వయంగా జగన్ సినిమాలో కనిపించబోతున్నాడు. అంటే ఆ సీన్స్ కోసం జగన్ ప్రత్యేకంగా ఏమీ నటించబోవడం లేదు. గతంలో ఉన్న వీడియో ఫుటేజ్ ను వాడబోతున్నారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ అరంగేట్రం - ఆ తర్వాత పాదయాత్ర - సీఎం అవ్వడం - మరణం వంటి ముఖ్య ఘట్టాలతో సినిమా సాగబోతుంది.
సినిమా చివరి పావుగంట పూర్తిగా వైఎస్ మరణంకు సంబంధించిన రియల్ ఫుటేజ్ - ఆ సమయంలో వైఎస్ అభిమానులు పడ్డ ఆవేదన - ఆ తర్వాత కుటుంబం వైఎస్ కు నిర్వహించిన అంతిమ యాత్ర ఫుటేజ్ లను చూపించబోతున్నారట. అందులో భాగంగానే జగన్ కనిపిస్తాడట. దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రంను చాలా విభిన్నంగా చూపిస్తున్నాడు. రెండు గంటల లోపే ఈ సినిమా ఉండేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా - ఒక రెగ్యులర్ సినిమా తరహాలో ఉండేలా దర్శకుడు జాగ్రత్త పడుతున్నాడు.