Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో వైయ‌స్ గుట్టు!?

By:  Tupaki Desk   |   29 Dec 2018 8:24 AM GMT
ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో వైయ‌స్ గుట్టు!?
X
ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో వైయ‌స్సార్ పాత్ర‌ను వివాదాస్ప‌దంగా చూపించారా? అస‌లింత‌కీ వైయ‌స్ పాత్ర ప‌రిధి ఎంత‌? అంటే అందుకు స‌రైన స‌మాధానం లేదు ఇంత‌వ‌ర‌కూ. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్నో పాత్ర‌లతో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌బోతోంది. అన్న‌గారి జీవితంలో తార‌స‌ప‌డిన ఎంద‌రో గొప్ప గొప్ప వాళ్ల పాత్ర‌లు వ‌చ్చి వెళుతుంటాయి. అందులో వైయ‌స్సార్ పాత్ర అంతే విశిష్ట‌మైన‌ది. అయితే రాజ‌కీయాల‌తో ముడిప‌డిన ఆ పాత్ర‌లో ఏదైనా కాంట్ర‌వ‌ర్శీ ఉంటుందా? అన్న సందేహం వైయ‌స్ అభిమానుల‌కు ఉంది.

ఇదే ప్ర‌శ్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కి మాట‌లు అందించిన స్టార్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ ని అడిగేస్తే .. ఈ చిత్రంలో ఎవ‌రినీ కించ‌ప‌రిచే స‌న్నివేశాలు ఉండ‌వ‌ని క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో సీఎస్ ఆర్, రేలంగి పాత్ర‌లు ఉన్నాయి. అలాగే ఇదే చిత్రంలో చంద్ర‌బాబు నాయుడు, వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వంటి గొప్ప నాయ‌కుల పాత్ర‌లు ఉన్నాయి. ఆ రెండు పాత్ర‌ల‌కు డైలాగ్స్ రాసే అదృష్టం నాకు క‌లిగింది. అంద‌రినీ గౌర‌వించేలానే ఇందులో డైలాగులు రాశాం. సినిమా అంద‌రినీ గౌర‌వించే విధంగానే ఉంటుంద‌ని అన్నారు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో వివాదాస్ప‌ద అంశాల కంటే ప్రేక్ష‌కుల‌కు ఏం చూపిస్తే గొప్ప‌గా అనిపిస్తుందో అదే చూపించామ‌ని సాయి మాధ‌వ్ తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆయ‌న క‌థ‌లో ఉన్న‌దున్న‌ట్టే చూపించే ప్ర‌య‌త్నం చేశామ‌ని అన్నారు. ముఖ్యంగా ఆడియెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్ర‌మే క‌థ‌ను చెప్పామ‌ని తెలిపారు. అయితే బుర్రా సాయి మాధ‌వ్ చెప్పిన దానిని బ‌ట్టి ఈ చిత్రంలో ఎలాంటి వివాదాస్ప‌ద అంశాల్ని చూప‌డం లేద‌నే అర్థ‌మ‌వుతోంది. ఒక ర‌కంగా ఆ వివాదాల్ని ట‌చ్ చేయ‌కుండా దాచేసేందుకే క్రిష్ ప్ర‌య‌త్నించారా? అన్న సందేహం క‌లుగుతోంది.`` ఏదీ దాచం.. ఏదీ దాచ‌లేదు`` అంటూనే అస‌లు వివాదాల్ని దాచేశారా.. అన్న సందేహాలు జ‌ర్న‌లిస్టుల్లో వ్య‌క్తం అయ్యాయి.

ఇక‌పోతే ఈ చిత్రంలో వివాదాస్ప‌ద అంశాల‌ పై ఇప్ప‌టికే మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావ్ చ‌ట్ట‌బ‌ద్ధంగా సంశ‌యాల్ని వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రైట‌ర్ బుర్రా సాయి మాధ‌వ్ లీక్స్ ని బ‌ట్టి ఈ చిత్రంలో చంద్ర‌బాబు ఎపిసోడ్స్ లో వివాదాస్ప‌ద అంశాల్ని దాచేశార‌ని భావించాల్సి ఉంటుంది. అలాగే నాదెండ్ల ఎపిసోడ్ ఉందా.. లేదా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.