Begin typing your search above and press return to search.
వైఎస్ ఆర్ యాత్ర ప్రారంభం కాబోతోంది
By: Tupaki Desk | 6 April 2018 4:55 PM GMTబహుశా టాలీవుడ్ లో సినిమాలకు సంబంధం లేని ఒక ముఖ్యమంత్రి మీద బయోపిక్ తీయటం జననేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కథతో తలపెట్టిన 'యాత్ర' నే మొదటిది అని చెప్పొచ్చు. గతంలో పాక్షికంగా కొన్ని సినిమాల్లో కొందరి నాయకుల జీవిత కథను చూపినా పూర్తి నిడివి గల మూవీ మాత్రం ఇప్పటి దాకా రాలేదన్నది నిజం. వైఎస్ఆర్ కథను సినిమాగా చూడాలన్న అభిమానుల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యతను భుజాన వేసుకున్న దర్శకుడు మహీ రాఘవ ఈ రోజు టైటిల్ లోగోతో పాటు క్యాప్షన్ లాంటిది విడుదల చేయటంతో చిన్న చిన్న అనుమానాలకు కూడా పూర్తి చెక్ పడిపోయింది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తుండగా మిగిలిన తారాగణం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
‘కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను-మీతో కలిసి నడవాలనుంది-మీ గుండె చప్పుడు వినాలనుంది’ అని రెండు లైన్లు లోగో కింద పెట్టిన మహీ ఇందులో ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పేసాడు. వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలక మజీలిగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో మిగిలిపోయిన పాద యాత్రను ఇందులో హై లైట్ చేయబోతున్నట్టు చెప్పకనే చెప్పినట్టే. మహి రాఘవ లాస్ట్ హిట్ ఆనందో బ్రహ్మ నిర్మాత 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్ తో పాటు విజయ్ చిల్లా-శశి దేవ్ రెడ్డి ఇందులో భాగస్వాములుగా ఉండబోతున్నారు. దీనికి సంగీతం ఎవరు అందించబోతున్నారు కెమెరా ఎవరు ఇవ్వబోతున్నారు అనే వివరాలు ఇప్పటికి గోప్యంగా ఉంచారు. ఏప్రిల్ 9 షూటింగ్ ప్రారంభించబోతున్నారు.
వైఎస్ఆర్ బయోపిక్ కాబట్టి సహజంగానే జనంలో ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్, 108 లాంటి పధకాల ద్వారా జనం గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన రాజశేఖర్ రెడ్డి కథ అంటే రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి ఉంటుంది. రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే. విడుదల ఈ ఏడాది ఉంటుందా లేక వచ్చే సంవత్సరం ఎన్నికల సమయంలో విడుదల చేస్తారా తదితర విషయాలు 9వ తేదిన వెల్లడి కావొచ్చు.