Begin typing your search above and press return to search.
'యుగానికొక్కడు' మళ్లీ వచ్చాడు..
By: Tupaki Desk | 1 Jan 2021 2:30 PM GMT‘యుగానికొక్కడు..’ 2010లో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారానే కార్తీ తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాడు. ‘7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సెల్వ రాఘవన్.. యుగానికొక్కడు (తమిళ్ లో ‘ఆయిరాతిల్ ఒరువన్’) మూవీని తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రం రెండోసారి రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 31న తమిళనాడు వ్యాప్తంగా 60 థియేటర్లలో సినిమాను రీ రిలీజ్ చేశారు.
తమిళనాడులో థియేటర్లు రీఓపెన్ అవడం.. కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాలో కార్తీ, ఆండ్రియా, రీమాసేన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే.. 2010లో ఎలాగైతే సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయో.. రీరిలీజ్ తర్వాత ఇప్పుడు కూడా అలాంటి ప్రశంసలే వస్తుండడం గమనార్హం. సినిమాను మళ్లీ చూసినవారు.. ఇప్పుడు కొత్తగా చూస్తున్నవారు సెల్వ రాఘవన్ దర్శకత్వ ప్రతిభను పొగుడుతున్నారు.
ఇక, సోషల్ మీడియాలో సెల్వ రాఘవన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో.. ఓ నెటిజన్ సెల్వ రాఘవన్ కు ఓ రిక్వెస్ట్ చేశారు. ‘దయచేసి ఈ చిత్రానికి సీక్వెల్ తీయండి’ అని కోరారు. దీనికి సమాధానం ఇచ్చిన సెల్వ రాఘవన్.. తప్పకుండా తీస్తానని మాటిచ్చారు.
కాగా.. ఈ చిత్రనికి సీక్వెల్ వస్తుందని పదేళ్ల నుంచి ప్రచారం నడుస్తూనే ఉంది. దర్శకుడు సెల్వ కూడా పలు సందర్భాల్లో ‘ఆయిరాతిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో తప్పక తీస్తాడని అంటున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్.. ధనుష్ హీరోగా కొత్త చిత్రానికి సిద్దమవుతున్నారు. ఇది పూర్తవగానే ‘ఆయిరాతిల్ ఒరువన్ 2’ గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
అయితే.. యుగానికొక్కడు-2లో కూడా హీరో కార్తీనే తీసుకోవాలని కోరుతున్నారు నెటిజన్లు. ఈ మేరకు డైరెక్టర్ కు పలువురు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సెల్వ రాఘవన్ ఏం చేస్తాడు? కార్తీకే బెర్త్ కన్ఫామ్ చేస్తారా? వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా..? అన్నది వేడి చూడాలి.