Begin typing your search above and press return to search.
కొత్త లుక్ తో మాజీ హీరోయిన్ కి టచ్ లోకొచ్చిన క్రికెటర్
By: Tupaki Desk | 26 March 2021 3:46 AM GMTక్రికెటర్లు కథానాయికల్ని ఏరికోరి ఎంపిక చేసుకుని లవ్ లో పడడం ఆనక పెద్దల్ని ఒప్పించి పెళ్లాడేయడం చూస్తున్నదే. ఇటీవల క్రికెటర్లు వీలు కుదిరితే తాము కూడా హీరోలుగా మారే ఆలోచనలు చేస్తున్నారు. ఇంతకుముందు శ్రీశాంత్.. ఇర్ఫాన్ ఫఠాన్ లాంటి యువ క్రికెటర్ల పేర్లు ఈ కేటగిరీలో వినిపించాయి. ఆ ఇద్దరూ హీరోలుగా నటించిన సినిమాల గురించి ఆసక్తికర చర్చ సాగింది.
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా అలాంటి ఆలోచన చేస్తున్నారా? అంటే అవుననేందుకు ఇదిగో ఇదే ప్రూఫ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగిపోతోంది. తాజాగా యూవీ తన కొత్త లుక్ తో అందరికీ షాకిచ్చారు. అతడు షేర్ చేసిన ఫోటోకి దాదాపు 6 లక్షల లైక్ లు దక్కాయి.
లాక్ డౌన్ ఒక్కొక్కరికి ఒక్కోలా కలిసొస్తే యూవీకి మాత్రం ఇలా కలిసొచ్చిందట. తొమ్మిది నెలల లాక్ డౌన్ లో యువరాజ్ తన జుట్టును బాగా పెంచాడు. ఇప్పుడు సాఫ్టెనింగ్ చేయించుకున్నాడట. మారిన ఈ కొత్త లుక్ తో ఇలా ఫోజిచ్చాడు. ఆసక్తికరంగా అతడి హెయిర్ ని డిజైన్ చేసింది ఒక సినీ హెయిర్ స్టైలిస్ట్. ప్రఖ్యాత సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ యువరాజ్ కొత్త లుక్ ని డిజైన్ చేశారు.
అతడి కొత్త లుక్ పై ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు స్పందించారు. శిఖర్ ధావన్ `పహ్జీ పూర్ బాద్షా లాగ్ రహే హో` అని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ పఠాన్ `బోయయ్యయ్యీ బాద్షాహ్హ్` అని కామెంట్ ని పోస్ట్ చేశారు. తాజాగా అతడి మాజీ ప్రేమికురాలు కిమ్ శర్మ కూడా నాటీ రిప్లయ్ ఇచ్చారు. జిప్పర్- ముఖం ఎమోజీని షేర్ చేసింది కిమ్. ``అవును లేదా కాదు.. లేదా ఉండవచ్చు.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలతో ఫన్ క్రియేట్ చేశారు నెటిజనం. యూవీ ఇటీవల ఇటీవలే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తో క్రికెట్ లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.