Begin typing your search above and press return to search.

బాలయ్యకు యువరాజ్ సింగ్‌ స్పెషల్‌ బర్త్‌ డే విషెష్‌

By:  Tupaki Desk   |   10 Jun 2023 3:22 PM GMT
బాలయ్యకు యువరాజ్ సింగ్‌ స్పెషల్‌ బర్త్‌ డే విషెష్‌
X
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రముఖులు పలువురు మరియు మీడియా వర్గాల వారు సోషల్‌ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు. లక్షలాది మంది బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్స్ చేశారు కానీ టీం ఇండియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్ సింగ్‌ చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

క్యాన్సర్‌ ను జయించిన యువరాజ్ సింగ్ మరియు క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న బాలయ్య మధ్య చాలా రోజులుగా పరిచయం ఉంది.

ఇద్దరు కూడా కొన్ని సార్లు కలిశారు. క్యాన్సర్ రోగులకు సహాయం కోసం ఒక ఫౌండేషన్ ను ప్రారంభించిన యువరాజ్ సింగ్‌ పలు కార్యక్రమాల్లో బసవతారకం ఆసుపత్రితో కలిసి ముందుకు నడిచారు.

ఆ అనుబంధం తోనే బాలకృష్ణ కు యువరాజ్ సింగ్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేశాడు. నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మీరు చేసే పలు పనులు మరియు మీ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ ఎంతో మందికి ఆదర్శం మరియు ఉపయోగదాయం అంటూ యువరాజ్ పేర్కొన్నాడు. ముందు ముందు గొప్ప కార్యక్రమాలు మీరు చేయాలని ఆశిస్తున్నాను అంటూ బర్త్‌ డే విషెష్‌ చెప్పాడు.

ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్‌ లు అందుకున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్నాడు. నేడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించిన విషయం తెల్సిందే.