Begin typing your search above and press return to search.

చౌద‌రి గారు చాన్నాళ్ల‌కు..!

By:  Tupaki Desk   |   7 Jan 2019 5:51 AM GMT
చౌద‌రి గారు చాన్నాళ్ల‌కు..!
X
కొంత గ్యాప్ త‌ర్వాత పెద్ద పండ‌గ(సంక్రాంతి) టైమ్ లో టాలీవుడ్ లో కొత్త సౌండింగ్ వినిపిస్తోంది. పాత సౌండ్ నే కొత్తగా వింటున్నాం. ఆ న‌లుగురు.. థియేట‌ర్ మాఫియా! అంటూ అనాదిగా వినిపిస్తున్న మాట‌నే వీళ్లు మ‌రికాస్త గ‌ట్టిగా వినిపించారు. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన ర‌జ‌నీ `పేట‌` ఈవెంట్ ప‌లు సెన్సేష‌న్స్ కి తావిచ్చింది. ఇక్క‌డ వేదిక‌పై `పేట` కంటే థియేట‌ర్ మాఫియా గురించే ఎక్కువ‌గా మాట్లాడ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లు పేట‌లో ఏం ఉంది? అనే కంటే - థియేట‌ర్ మాఫియాని అంతం చేయ‌డ‌మెలా? అన్న‌దానిపైనే వ‌క్త‌లంతా మాట్లాడ‌డం పెద్ద షాకిచ్చింది.

ఈ వేదిక‌పై పేట చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న అశోక్ వ‌ల్ల‌భ‌నేని అయితే న‌యీమ్ ని షూట్ చేసిన‌ట్టు - థియేట‌ర్ మాఫియాని - ఆ న‌లుగురుని షూట్ చేయాల‌ని కేసీఆర్ - చంద్ర‌బాబు వంటి పెద్ద‌ల్ని కోరారు. ఆయ‌న‌కు వంత పాడుతూ నిర్మాత ప్ర‌స‌న్న‌కుమార్ మాఫియాపై విరుచుకుప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా ఆ ఇద్ద‌రికీ తోడుగా వైవియ‌స్ చౌద‌రి ఈ వేదిక‌పైకి రావ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లేం జ‌రుగుతోంది ఇండ‌స్ట్రీలో.. ఉన్న‌ట్టుండి వైరి వ‌ర్గాలు అంద‌రూ ఒకే తాటిపైకి వ‌చ్చి ఇలా వేదిక‌లెక్కి ఆ న‌లుగురిపై విరుచుకుప‌డ్డారేంటి? అంటూ ఆస‌క్తిక‌ర ముచ్చ‌టా సాగుతోందిప్పుడు.

కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు - ప‌రాభ‌వాల‌ త‌ర్వాత వైవియ‌స్ చౌద‌రి టాలీవుడ్ నుంచి మాయమ‌య్యారు. మ‌ళ్లీ ఇన్నాళ్టికి `పేట` వేదిక‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. పైగా వ‌స్తూనే ఆయ‌న థియేట‌ర్ మాఫియాని త‌న‌దైన శైలిలో క‌డిగేశారు. సినిమా గురించి కంటే థియేట‌ర్ మాఫియాపైనే ఎక్కువ మాట్లాడారు ఆయ‌న‌. ఈ మూకుమ్మ‌డి దాడితో అస‌లేమైంది? థియేట‌ర్ మాఫియాపై మూకుమ్మ‌డి దాడి వెన‌క వ్యూహం ఏమై ఉంటుంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ప్ర‌స్తుతం సాగుతోంది.

పేట ఈవెంట్ లో వైవీయ‌స్ చౌద‌రి మాట్లాడుతూ- ``పేట నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని ఓ డైన‌మైట్. నిర్మాత అన‌గానే లెక్క‌లు.. బిజినెస్ చేస్తారు. ఈయ‌న‌లో కాలిక్యులేష‌న్స్ తో పాటు సాహ‌సమూ ఉంది. దీనికి ఉదాహ‌ర‌ణ న‌వాబ్‌. అప్పుడు కూడా న‌వాబ్ సినిమాకు థియేట‌ర్లు లేవు. అయినా ఆయ‌న సాహ‌సానికి డ‌బ్బులొచ్చాయి. సినిమా ఆడింది. ఆ త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌చ్చిన‌ రెండో సినిమా స‌ర్కార్. అది వ‌చ్చే స‌మ‌యానికి థియేట‌ర్లు దొరికే ప‌రిస్థితి లేదు. ఆ స‌న్నివేశంలోనూ ఆయ‌న అస‌లు మాన‌సిక ఒత్తిడిని ఖాత‌రు చేయకుండా న‌మ్మ‌కంతో సినిమాలు తెస్తున్నారు. అంద‌రూ ఆయ‌న్ని అభినందించాలి. స‌హ‌క‌రించాలి. సాయం చేయాలి. న‌వాబ్‌, స‌ర్కార్ లను మించిన సినిమా పేటా. ఈ సినిమాలో ద‌మ్ముంద‌ని ట్రైల‌ర్ చెప్పింది. సంక్రాంతికి సినిమా విడుద‌ల చేయ‌డం ఎంతో క‌ష్టం. ర‌జ‌నీకాంత్ సినిమాకే ఈ దారుణ స‌న్నివేశ‌మా? ఇలా అయితే మిగిలిన సినిమాల ప‌రిస్థితి ఏమిటో!`` అని అన్నారు. అప్ప‌ట్లో చౌద‌రి గారు తీసిన సినిమాల‌కు ఇలానే థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తింది. అలాగే ఆయ‌న తీసిన మెగా సినిమా `రేయ్` రిజ‌ల్ట్ ఏంటో అంద‌రికీ తెలిసిందే.