Begin typing your search above and press return to search.

అమ్మడి యోగాతో సోషల్ మీడియా షేక్

By:  Tupaki Desk   |   1 March 2019 5:37 AM GMT
అమ్మడి యోగాతో సోషల్ మీడియా షేక్
X
ఈమధ్య జనాల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. పెరగడం కాదు ఉన్మాదంగా మారింది. మన ఇంటికి వచ్చే గెస్టులు చెప్పే మాటలలోనే ఇది అర్థం అవుతుంది. ఒకరు నేను షుగర్ మానేశాను అంటారు.. మరొకరు ఆయిల్ అసలు వాడడం లేదు అంటారు.. ఇంకొకరు రైస్ కు రామ్ రామ్ చెప్పానంటాడు. మరొకరు జఫ్ఫా డైట్ లో ఉన్నాను జస్ట్ గాలి పీలుస్తాను అంతే అంటాడు. ఇలా చెప్పేవాళ్ళకు ఎవరైనా ఏం ఆతిథ్యం ఇవ్వగలరు ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చి ఊరుకోవడం తప్ప!

ఇది తిండి గోల. దీంతో పాటు మరో గోల ఉంది.. అదే ఎక్సర్ సైజుల గోల. ఒకరు యోగా.. మరొకరు ఏరోబిక్సు.. ఇంకొరు జుంబా డాన్స్. కాస్త ఫిట్నెస్ పిచ్చి ఎక్కువగా ఉంటే నేను ఇంట్లోనే 24 గంటలూ నడుస్తూ..... ఉంటాను అంటాడు. ఇలా జనాల్లో ఫిట్నెస్ పట్ల ఆసక్తి మరీ ఎక్కువ అయింది కాబట్టే సెలబ్రిటీలు కూడా తమ ఎక్సర్ సైజు వీడియోలు షేర్ చేస్తూ నెటిజనులను ఆకట్టుకుంటున్నారు. అప్పట్లో శిల్పా శెట్టి యోగా వీడియోలతో ఎంతో పాపులారిటీ సంపాదించింది. తాజాగా మరో బాలీవుడ్ సెలబ్రిటీ జరీన్ ఖాన్ తన యోగా ప్లస్ ఎక్సర్ సైజ్ వీడియోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఇంతకీ ఈ జరీన్ ఖాన్ గారు ఎవరని అడిగారంటే మీరు హిందీ సినిమాలను సరిగా ఫాలో కావడంలేదనే అర్థం. సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 'హౌస్ ఫుల్ 2'.. 'హేట్ స్టొరీ 3'.. 'అక్సర్ 2'.. '1921 లాంటి సినిమాలలో నటించింది. భామ ఇంట్రో అయిపోయిందిగా.. ఇక వీడియో సంగతి మాట్లాడుకుంటే.. జిమ్ములో ఒక టైట్ ప్యాంట్.. కాస్త లూజ్ గా ఉండే వైట్ కలర్ టీ షర్ట్ లో అన్ని రకాల ఎక్సర్ సైజులను కలిపి ఎడాపెడా చేసి పారేసింది. అసలే హాటు భామ.. ఆ భంగిమలు మగ నెటిజనుల మనసులపై సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టుగా ఉన్నాయి. ఫిబ్రవరి 20 న ఆమె కసరత్తుల వీడియో ను అప్లోడ్ చేస్తే ఇప్పటివరకూ 1.6 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇక వీడియో కింద కామెంట్ల గురించి రాస్తే అదో పెద్ద బూతు గ్రంధం అవుతుంది కాబట్టి అంత రిస్క్ చేయడం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో చూసిన తర్వాత కామెంట్స్ ను ఉత్సాహంగా చదివేయండి. మీరు సెన్సారు సభ్యుల తరహా అయితే అంతా చూసి.. చదివి.. మిగతా ఎవ్వరూ చూడొద్దని.. చదవొద్దని.. అడల్ట్ కంటెంట్ ఉందని హెచ్చరిక జారీ చేయండి!