Begin typing your search above and press return to search.

పళ్ళన్నీ రాలిపోతాయ్.. జాగ్రత్త

By:  Tupaki Desk   |   20 Feb 2018 7:56 AM GMT
పళ్ళన్నీ రాలిపోతాయ్.. జాగ్రత్త
X
సోషల్ మీడియా ప్రపంచంలో వ్యక్తగత స్వేచ్చకు రెక్కలు రావడం కాదు ఏకంగా విమానం లాంటీ ఇంజన్ లు వచ్చాయి. దీంతో నెటిజన్స్ వారి అభిప్రాయాలను చాలా వేగంగా ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తున్నారు. అయితే ఆ వేగంలో కొంత మంది ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్లు సెలబ్రెటీలు కించపరిచేవిధంగా కామెంట్స్ చేస్తుండడం కామన్ అయిపొయింది. చాలా వరకు సెలబ్రెటీలు ఈ విషయాల్ని పట్టించుకోరు.

కానీ కొందరు సీరియస్ గా తీసుకొని రివర్స్ కౌంటర్లు ఇస్తుంటారు, మరికొందరు మళ్లీ సోషల్ మీడియాలోకి రాకూడదని అనుకుంటారు. ఇలాంటివి నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతుండేవే. కానీ రీసెంట్ గా జరిగిన ఓ ఘటన మాత్రం చాలా డిఫెరెంట్ గా అనిపించింది. తనపై కామెంట్ చేసిన ఒక నెటిజన్ ను ఒక నటీ గట్టిగా తిట్టేసింది. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ పై ‘ట్రోల్‌ పోలీస్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తే వారిని పిలిచి సెలబ్రెటీలతో మాట్లాడిస్తారు.

రీసెంట్ గా జరీన్ ఖాన్ ఆ షోకి వచ్చింది. తనపై నెగిటివ్ కామెంట్ చేసిన వ్యక్తిని చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. ఇష్టం ఉన్నట్లు తిట్టేసింది. నా చెయ్యి చాలా పెద్దది. కొడితే మొత్తం పళ్ళన్నీ రాలిపోతాయ్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. అంతే కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది కూడా. ఇక అందుకు సంబందించిన వీడియోను జరీన్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ మరో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.