Begin typing your search above and press return to search.

జూనియర్ కత్రినాకి ప్రేమంటే అదేరా!

By:  Tupaki Desk   |   5 Aug 2016 4:32 AM GMT
జూనియర్ కత్రినాకి ప్రేమంటే అదేరా!
X
బాలీవుడ్ బ్యూటీ జరైన్ ఖాన్ గతేడాది హేట్ స్టోరీ3 అంటూ అడల్ట్ కంటెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన ఈ భామకి.. జూనియర్ కత్రినా కైఫ్ అనే పేరుంది లెండి. లుక్స్ విషయంలో కొన్ని కొన్ని యాంగిల్స్ లో అమ్మడు.. కేట్ ని గుర్తు చేసేస్తుంది. అయితే గతేడాది హేట్ స్టోరీ చేసిన ప్రభావమో ఏమో తెలీదు కానీ.. ఇప్పుడో మ్యూజిక్ ఆల్బంతో ప్రేక్షకులను పలకరించింది.

'ప్యార్ మాంగా హై'.. ఇదీ టైటిల్.. ప్రేమ కావాలని తపించిపోతూ ఉంటుందన్న మాట జరైన్. ఆ పాట కూడా ముఝే ప్యార్ కరో అనే సాగుతుంది. అఫ్ కోర్స్ ప్రేమ అడిగేది తన పార్ట్నర్ నే అయినా.. ఇక్కడ మేటర్ ఏంటంటే.. ఆవిడ అడిగే ప్రేమ ఏంటన్నదే. ఇంతకీ ఈ మ్యూజిక్ వీడియోలో ఉండే కంటెంట్ ఏంటంటే.. ఇద్దరు పార్ట్నర్స్ మధ్య ఉండే అలౌకిక ఆనందం అన్న మాట. అంత పెద్ద పెద్ద మాటలొద్దని అనుకుంటే.. మొత్తం వీడియో అంతా మూతి ముద్దులు పెట్టుకుంటూ ఉంటారని సింపుల్ గా చెప్పేసుకోవచ్చు.

చివర్లో ఓ సెక్స్ సీన్ ని కూడా పెట్టారు లెండి. జరైన్ ఖాన్ వీలైనంతగా సెక్స్ పోజింగ్ చేసింది. బహుశా హేట్ స్టోరీలో సంపాదించిన అనుభవం అంతా ఇక్కడ కుమ్మరించేసినట్లుంది. మొత్తానికి ఈ టైపు సినిమాలకు తాను రెడీ అంటూ.. ఏం చేయగలదో శాంపిల్ చూపించింది జూనియర్ కత్రినా కైఫ్.