Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' శాటిలైట్ రైట్స్ ఎవరికంటే..?
By: Tupaki Desk | 24 Dec 2021 9:45 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు.
ఇప్పటికే 'రాధే శ్యామ్' చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
ఇందుకుగాను జీ స్టూడియోస్ వారు 'రాధే శ్యామ్' మేకర్స్ కు భారీ మొత్తాన్ని చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. అలానే ఈ పీరియాడికల్ లవ్ డ్రామా పోస్ట్ థియేటర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా మీడియా దిగ్గజమే తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ గత చిత్రం 'సాహో' రైట్స్ కూడా జీ గ్రూప్ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, 'రాధే శ్యామ్' చిత్రంలో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనుంది. లేటెస్టుగా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇందులో కేవలం లవ్ స్టోరీయే కాదు.. అంతకుమించి ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ చెబుతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - మురళీ శర్మ - సచిన్ ఖేడ్‌కర్ - జయరామ్ - ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ - యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. హిందీలో టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.
'రాధే శ్యామ్'దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.