Begin typing your search above and press return to search.

గుస‌గుస‌.. RC15 హిందీ రైట్స్ 350 కోట్లా..?

By:  Tupaki Desk   |   17 Feb 2022 2:30 AM GMT
గుస‌గుస‌.. RC15 హిందీ రైట్స్ 350 కోట్లా..?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ 15వ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ క్రేజీ కాంబినేష‌న్ పై నెల‌కొన్న అంచ‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా కేట‌గిరీలో సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో అంచ‌నాలు స్కేని ట‌చ్ చేస్తున్నాయి.

దీంతో బిజినెస్ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఇంకా టైటిల్ కూడా ఖ‌రారు కాక‌ముందే కార్పోరేట్ కంపెనీలు తెలుగు రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీప‌డుతున్నాయి. ఇప్ప‌టికే హిందీ రైట్స్ ని జీ స్టూడియోస్ ద‌క్కించుకుంది. హిందీ థియేట్రిక‌ల్ రైట్స్ స‌హా శాటిలైట్..డిజిట‌ల్ హ‌క్కుల్ని జీ స్టూడియోస్ చేజిక్కించుకుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అందుకోసం భారీ మొత్తం వెచ్చించిన‌ట్లు గ‌తంలో స్థానిక మీడియా సంస్థ‌ల్లో వైర‌ల్ గా మారింది. తాజాగా ఇదే విష‌యాన్ని జాతీయ మీడియా సైతం ఖ‌రారు చేసింది. దాదాపు 350 కోట్లు వెచ్చించి హిందీకి సంబంధించి అన్ని ర‌కాల హ‌క్కుల్ని చేజిక్కించుకున్న‌ట్లు ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియా వెబ్ సైట్ ధృవీక‌రించింది.

ఇత‌ర భాష‌ల శాటిలైట్..డిజిట‌ల్ ..థియేట్రిక‌ల్ రైట్స్ మాత్రం చిత్ర నిర్మాత దిల్ రాజ్ వ‌ద్ద‌నే ఉన్నాయి. అయితే వీటి కోసం ప‌లు కార్పోరేట్ కంపెనీలు పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ తొలి పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` త‌ర్వాత రిలీజ్ అవుతున్న చిత్రం కావ‌డంతోనే ఈ రేంజ్ లో పోటీ వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న `ఆర్.ఆర్.ఆర్` విజ‌యం సాధిస్తే చ‌ర‌ణ్ క్రేజ్ పాన్ ఇండియా లెవ‌ల్లో వెలిగిపోతుంది. అందుకే కార్పోరేట్ కంపెనీలు ఆర్.సీ 15 విష‌యంలో ముందుగానే కర్చీప్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్థానిక భాష‌ల్లో మాత్రం ఈ చిత్రాన్ని దిల్ రాజు త‌న భాగ‌స్వాముల‌తో క‌లిసి సొంతంగా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ ని హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూర్త‌యింది. మ‌ధ్య‌లో కొంత విరామం తర్వాత మ‌ళ్లీ టీమ్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రిలో రెండ‌వ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. జూన్ నెలాఖ‌ర‌కు షూటింగ్ మొత్రం పూర్త‌వుతుంద‌ని స‌మాచారం.

ఆ త‌ర్వాత ఆరు నెల‌లు పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతాయి. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని 2023 లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అద్వాని హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఇందులో చ‌ర‌ణ్ నిజాయితీప‌రుడైన‌ ఐఏఎస్ అధికారి పాత్ర నుంచి రాజ‌కీయ నాయుడిగా ట‌ర్న్ తీసుకుంటే స‌మాజంలో ఎలాంటి మార్పులు వ‌స్తాయి? అన్న పాయింట్ ని బేస్ చేసుకుని త‌న‌దైన శైలిలో శంక‌ర్ స్క్రిప్ట్ ని డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోసారి సినిమాలో శంక‌ర్ మార్క్ క‌నిపించ‌డం ఖాయం. చ‌ర‌ణ్ కెరీర్ బెస్ట్ ఇదే అవుతుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.