Begin typing your search above and press return to search.
2.0కు కళ్లు చెదిరే డీల్..కానీ బాహుబలి వెనకే’
By: Tupaki Desk | 13 March 2017 3:02 PM GMTబిజినెస్ పరంగా ప్రస్తుతం ఇండియాలో అన్ని రికార్డులూ ‘బాహుబలి’ పేరిటే ఉన్నాయి. కానీ ఆ రికార్డులకు సంబంధించిన అధికారిక లెక్కలు బయటికి రాలేదు. ఐతే ఇప్పుడు రోబో సీక్వెల్ ‘2.0కు సంబంధించి ఓ అఫీషియల్ డీల్.. ఇండియన్ సినిమాలో శాటిలైట్ హక్కులకు సంబంధించి కొత్త రికార్డును ఈ సినిమా ఖాతాలో వేసింది. ఈ చిత్రానికి తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో కలిపి శాటిలైట్ హక్కులతోనే ఏకంగా రూ.110 కోట్లు ముట్టడం విశేషం. ప్రముఖ ఛానెల్ జీ టీవీ 2.0 శాటిలైట్ హక్కుల్ని ఈ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ‘2.0’ నిర్మాతలే అధికారికంగా ప్రకటించడం విశేషం.
‘2.0’ ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తోంది. ఐతే కేవలం శాటిలైట్ హక్కులతోనే నాలుగో వంతుకు పైగా బడ్జెట్ రికవర్ అయిపోయింది. దీన్ని బట్టే ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఐతే అఫీషియల్ రికార్డుల ప్రకారం ‘2.0’దే బిగ్గెస్ట్ శాటిలైట్ డీల్ కావచ్చేమో కానీ.. అనధికారికంగా మాత్రం ‘బాహుబలి’దే రికార్డు. ‘బాహుబలిః ది కంక్లూజన్’ శాటిలైట్ హక్కులు అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.200 కో్ట్ల దాకా పలికినట్లు అంచనా. హిందీ హక్కులే రూ.57 కోట్లు పలికితే.. తమిళ హక్కులు సైతం రూ.55 కోట్ల దాకా తెచ్చిపెట్టాయి. తెలుగు.. మలయాళం కూడా కలిపితే లెక్క దాదాపు రూ.200 కోట్లకు దగ్గరగా ఉంటుందని అంచనా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/