Begin typing your search above and press return to search.
ఒకేసారి 11 ఒరిజినల్ సిరీసులను లాంచ్ చేసిన ప్రముఖ ఓటీటీ..!
By: Tupaki Desk | 15 Jun 2022 2:52 PM GMTప్రస్తుతం ఓటీటీ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వేదికలలో ZEE5 ఒకటి. ఇది భారతదేశపు అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్. విభిన్నమైన కంటెంట్ కు ప్రసిద్ధి చెందిన జీ5 ఓటీటీ.. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్పురి, గుజరాతీ, పంజాబీ వంటి 12 భారతీయ భాషల్లో వీక్షకులను అలరిస్తోంది.
ఇప్పుడు జీ5 ఓటీటీ లైబ్రరీలో 3500కి పైగా చలనచిత్రాలు - 1750 టీవీ ప్రోగ్రామ్స్ - 700 ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయి. వెబ్ సిరీసులు - బ్లాక్ బస్టర్ సినిమాలు మరియు ఉత్తమమైన డబ్బింగ్ కంటెంట్ తో అందరికీ అపరిమితమైన వినోదాన్ని ఉత్సాహాన్ని అందిస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకుల కోసం తాజాగా మరో 11 ఆసక్తికరమైన ఒరిజినల్స్ అందించడానికి రెడీ అయ్యారు.
ఈరోజు హైదరాబాద్ లో ‘హుక్డ్’ - స్టార్-స్టడెడ్ ఈవెంట్ లో టాలీవుడ్ కు చెందిన దిల్ రాజు - హరీష్ శంకర్ - ప్రవీణ్ సత్తారు - సుశాంత్ - ఆది సాయి కుమార్ - రాజ్ తరుణ్ - శరత్ మరార్ - కోన వెంకట్ - నిహారిక - సుస్మిత కొణిదెల వంటి సినీ ప్రముఖుల సమక్షంలో ఈ 11 ఒరిజినల్స్ సిరీస్ లను ZEE5 ఓటీటీ గ్రాండ్ గా లాంచ్ చేసింది.
శివ బాలాజీ - శ్రీరామ్ - ధన్య బాలకృష్ణ - రాజేశ్వరి నాయర్ - ఆడుకలం నరేన్ - శరణ్య ప్రదీప్ - సమ్మెట గాంధీ - ఈస్టర్ నొరోన్హా వంటి భారీ తారాగణం నటించిన మల్టీస్టారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ''రెక్కీ'' జూన్ 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అక్కినేని హీరో సుశాంత్ ఓటీటీ డెబ్యూ 'మా నీళ్ల ట్యాంక్' అనే రొమాంటిక్ కామెడీ సిరీస్ కూడా విడుదల కాబోతోంది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘ATM’ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. సుబ్బరాజు - పృధ్వి మరియు VJ సన్నీ ప్రధాన పాత్రల్లో నటించిన హీస్ట్ కామెడీ ఇది. దీనితో పాటు రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ కలిసి నటించిన ‘ఆహా నా పెళ్లంట’ ఒరిజినల్ లోని ఒక పాట లిరికల్ వీడియోను ఆవిష్కరించారు. జీవిత భాగస్వామిని కనుగొనడంలో ఒక వ్యక్తి చేసిన విఫల ప్రయత్నానికి సంబంధించిన ఫన్నీ రొమాంటిక్ షో ఇది.
'ఒక చిన్న ఫామిలీ స్టోరీ' సక్సెస్ తరువాత ఎలిఫెంట్ బ్యానర్ పైన నిహారిక కొణిదల నిర్మించిన 'హలో వరల్డ్' కూడా త్వరలోనే రాబోతోంది. హైదరాబాద్ లో ఐటీ రంగంలో తమ కెరీర్లో దూసుకుపోతున్న యువకుల జీవితాల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న 'మిషన్ తషాఫీ' అనే గూఢచారి డ్రామా కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.
వీటితో పాటుగా 'పరువు' 'బహిష్కరణ' 'ది బ్లాక్ కోట్' 'ప్రేమ విమానం' 'హంటింగ్ ఆఫ్ ది స్టార్స్' వంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఒరిజినల్స్ జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. కామెడీ, డ్రామా, రొమాన్స్, థ్రిల్లర్స్.. ఇలా అన్ని జోనర్లలో కంటెంట్ ను అందించబోతున్నారు. 11 తెలుగు ఒరిజినల్ కంటెంట్ ను ఆవిష్కరించడం ద్వారా దక్షిణాదిలోని వీక్షకులకు ZEE5 మరింత చేరువ అవుతుందని నిర్వహకులు భావిస్తున్నారు.
ఇటీవలే జీ5లో స్ట్రీమింగ్ చేయబడిన అజిత్ 'వలిమై' సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 500-మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పొందింది. అలానే రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ‘RRR’ విడుదల చేయగా.. 10 రోజుల్లో 1000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను అందుకుని సంచలనం సృష్టించింది.
'ఆర్.ఆర్.ఆర్' సినిమా ZEE5లో తెలుగుతో సహా మొత్తం 4 భాషల్లో #1 ట్రెండింగ్ లో ఉంది. ప్రాంతీయ మార్కెట్లలో మరింత మందికి చేరువ అవడానికి.. వీక్షకులకు నాణ్యమైన కంటెంట్ తో అలరించడానికి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా ఒరిజినల్ కంటెంట్ తో వస్తోంది. ఈ క్రమంలోనే 11 వెబ్ సిరీస్ లతో రాబోతోంది. ఈ నేపథ్యంలో 'కార్తికేయ-2' మరియు 'హను-మాన్' వంటి రాబోయే చిత్రాలను కూడా కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ మనీష్ కల్రా మాట్లాడుతూ.. “ZEE5లో మాకు సౌత్ ఒక ముఖ్యమైన మార్కెట్. వీక్షకుల ఆదరణ పొందడానికి తెలుగు ప్రేక్షకులకు అవసరమైన కంటెంట్ ను అందించడానికి ఈ ఓటీటీ మొదటి నుంచీ స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కంటెంట్ కోసం పెరుగుతున్న ఆదరణను మేము ముందే ఊహించాము. మేము తెలుగు పరిశ్రమలోని ట్యాలెంట్ ఉన్న వారితో కలిసి పని చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రేక్షకులకు అసాధారణమైన వినోదాన్ని అందించడంలో ఇక్కడున్న క్రియేటర్స్ కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం'' అని అన్నారు.
ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, కంటెంట్ & ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రెసిడెంట్ పునీత్ మిశ్రా మాట్లాడుతూ.. “ఇటీవల కాలంలో మేము భారతీయ ప్రేక్షకుల వీక్షణ విధానాలలో గణనీయమైన మార్పును చూశాము. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన మార్కెట్లైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో మంచి కంటెంట్ ను ఆదరిస్తున్నారు. దాంతో వీక్షకుల సంఖ్యలో పెరుగుదల గణనీయంగా ఉంది. ZEE5 ను మరింత వృద్ధిలొకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాము''
''ఎప్పటికప్పుడు వీక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని నిరంతరం కృషి చేస్తున్నాము. వినియోగదారు మరియు సంస్కృతి ఆలోచనల ఆధారంగా అసాధారణమైన కథనాలను అందించడంపై దృష్టి పెట్టాం. ZEEలో #SoulToScreen విధానం మా ప్రేక్షకులకు ప్రీమియం కంటెంట్ ను అందించడానికి, ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాము. తెలుగులో కొత్త కథలను అన్వేషిస్తూ ప్రేక్షకులను వినోదభరితంగా ఉంచడానికి నిరంతరం కృషి చేస్తాం'' అని అన్నారు.
చీఫ్ కంటెంట్ ఆఫీసర్ శ్రీమతి అనురాధ గూడూరు మాట్లాడుతూ “ZEE తెలుగు మార్కెట్లో విస్తృతమైన ప్రేక్షకులతో చాలా బలమైన గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. కొత్త కంటెంట్ ను ప్రారంభిస్తూ ఓటీటీని మరింత ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. తాజాగా 11 కొత్త ఒరిజినల్ కథలు మరియు ఐకానిక్ సినిమాలను వివరించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన ట్యాలెంట్ ఉన్న టీంతో సహకరించడానికి మేము సంతోషిస్తున్నాము'' అని అన్నారు.