Begin typing your search above and press return to search.

యంగ్ హీరో `పే పెర్ వ్యూ` ప్లాన్ నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   16 Sep 2020 3:00 PM GMT
యంగ్ హీరో `పే పెర్ వ్యూ` ప్లాన్ నిజ‌మేనా?
X
ఇటీవ‌ల పే ప‌ర్ వ్యూ విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది. అయితే అంత‌గా ఇమేజ్ లేని హీరోల సినిమాల్ని డ‌బ్బు చెల్లించి ఓటీటీ యాప్ ల‌లో చూసేంత ఓపిక ఎవ‌రికీ లేదు. కానీ నితిన్ లాంటి క్రేజీ హీరో సినిమాకి ఈ ప్రాతిప‌దిక‌న లాభాలు తేగ‌లిగే ఛాన్సుంద‌ని భావిస్తున్నార‌ట.

ఇంత‌కీ ఏ సినిమా? అంటే.. నితిన్ న‌టించిన `రంగ్ దే` ఓటీటీలోకి వ‌చ్చేయ‌నుంద‌ని ప్ర‌చారం సాగిపోతోంది. దీనిపై చిత్ర‌బృందం ఎలాంటి అధికారిక స‌మాచారాన్ని రివీల్ చేయ‌క‌పోయినా ఈ మూవీ జీ5 వాళ్ల‌కు అమ్మేశార‌ని జీ ప్లెక్స్ లో పే పెర్ వ్యూ విధానంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఇక ఓటీటీ డీల్ రూపంలోనే 20శాతం లాభం ముందే వ‌చ్చేసింద‌న్న ప్ర‌చారం సాగిపోతోంది.

అయితే ఇవ‌న్నీ నిజ‌మేనా కాదా? అన్న‌ది`రంగ్ దే`ని నిర్మించిన సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బృందం క‌న్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక పే పెర్ వ్యూకి పెద్ద రేటు నిర్ణ‌యిస్తే జ‌నం చూసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారా అంటే సందేహ‌మే. అలా కాకుండా చిన్న సైజ్ రేట్ తో ముందుకొస్తే వ్యూవ‌ర్ షిప్ పెంచే వీలుంటుందేమో! ఇక భీష్మ లాంటి హిట్ సినిమాలో న‌టించిన నితిన్ రంగ్ దే చిత్రంతోనూ మంచి విజ‌యం సాధించాల‌న్న క‌సితో ఉన్నాడు. వెంకీ అట్లూరి చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ముగించి శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు ఉప‌క్ర‌మించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత స‌న్నివేశంలో థియేట్రిక‌ల్ రిలీజ్ క‌ష్టం కాబ‌ట్టి ఓటీటీకి నితిన్ అంగీక‌రించారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.