Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ ఓల్డ్ బోల్డ్ పిక్.. ఇంటర్నెట్ షేక్

By:  Tupaki Desk   |   18 Feb 2023 3:00 PM GMT
స్టార్ హీరోయిన్ ఓల్డ్ బోల్డ్ పిక్.. ఇంటర్నెట్ షేక్
X
బాలీవుడ్ ను ఒకప్పుడు తన అందంతో ఓ ఊపు ఊపేసిన అలనాటి తార జీనత్ అమన్. 1970 80 దశకాల్లో ఆమెను స్క్రీన్ పై చూస్తే కుర్రకారు తెగ ఊగిపోయేవారు. ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. వాటిలో ఒకటి 'సత్యం శివం సుందరం' ఒకటి. 1978లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ ముందు భారీ విజయం సాధించింది. అయితే తాజాగా ఈ అలనాటి తార ఆ సినిమాలోని తన లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ ఫొటోలో జీనత్ ఫుల్ గ్లామరస్ గా హాట్ గా కనిపించింది. ఈ ఫోటో వెనక ఉన్న కథ గురించి కూడా వివరించింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. వారందరూ తెగ లైక్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

కాగా రాజ్ కపూర్ తెరకెక్కించిన సత్యం శివం సుందరం చిత్రంలో శశి కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రానికి జీనత్ అమన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసే ముందు ఆమెకు దర్శకుడు లుక్ టెస్ట్ చేశారు. కొన్ని ఫొటో షూట్లు చేశారు. అందులోని ఒక ఫోటోనే జీనత్ అమన్ ఇప్పుడు పోస్ట్ చేశారు. దీనిని 1977లో జేపీ సింఘాల్ అనే ఫొటోగ్రాఫర్ తీసినట్లు ఆమె వెల్లడించారు. ముంబైలోని ఆర్కే స్టూడియోలో ఈ టెస్ట్ నిర్వహంచినట్లు పేర్కొన్నారు. ఈ టెస్టు కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అథైయ్యా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని చెప్పారు.

అయితే సినిమాలోని జీనత్ పాత్ర రూప అప్పట్లో వివాదాస్పదమైంది. జీనత్ ఆరబోసిన గ్లామర్ విషయంలో దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీని పై గురించి కూడా ఆమె మాట్లాడారు. అందులో అశ్లీలత అభ్యంతరం ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దర్శకుడికి కావాల్సినట్లుగా అందంగా కనిపించడమే తన బాధ్యత అని జీనత్ తెలిపారు. సినిమాలో కనిపించే ప్రతీదీ ముందుగానే ప్రాక్టీస్ చేసి కొరియోగ్రఫీ చేస్తారని బోలెడంత మంది సిబ్బంది ముందు అలాంటివి చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

ఈ సినిమాలోని తన పాత్ర గురించి రాజ్ కపూర్ కు మొదట అనుమానం ఉండటంతో ముందుగా తనకు సంబంధించిన రీల్ను డిస్ట్రిబ్యూటర్లకు ఆయన ప్రదర్శించినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ రీల్ చూసిన వెంటనే అందరూ సినిమాను కొనేశారని జీనత్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.