Begin typing your search above and press return to search.
టాలీవుడ్ నిర్మాతల్ని ఓటీటీల్ని కలవరపెట్టిన ఆ ఫలితం
By: Tupaki Desk | 26 May 2021 2:30 AM GMTసక్సెస్ పాజిటివ్ వైబ్స్ నింపుతుంది. ఫెయిల్యూర్ నెగెటివ్ వైబ్స్ తో నీరసం తెచ్చేస్తుంది. ప్రస్తుం జీప్లెక్స్ ఓటీటీ సన్నివేశమిదేనని తెలుస్తోంది. సల్మాన్ భాయ్ నటించిన రాధే చిత్రాన్ని జీప్లెక్స్ పే-పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేయగా దానికి ఆశించిన రిజల్ట్ దక్కలేదు. ఇప్పుడు ఈ రిజల్ట్ ప్రభావం జీప్లెక్స్ తో తెలుగు సినిమాల ఒప్పందాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తెలిసింది.
సెకండ్ వేవ్ లో పెండింగ్ లో ఉన్న చిత్రాల ప్రత్యక్ష OTT విడుదల కోసం స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలు నిర్మాతలను సంప్రదిస్తున్నాయి. జీ ప్లెక్స్ ద్వారా రాధే డైరెక్ట్- ఓటీటీ విడుదలను చూశాక మరిన్ని సినిమాలు ఈ మోడల్ ను అనుసరించవచ్చనే ఊహాగానాలు సాగాయి. అయితే జీ ప్లెక్స్ టాలీవుడ్ నిర్మాతలను సంప్రదించినా డీల్స్ కుదరకు నిరాశతో ఉందిట.
ఇటీవల ఓ రెండు తెలుగు చిత్రాల నిర్మాతలను జీ ప్లెక్స్ బృందం సంప్రదించింది. ఈపాటికే విడుదల కావాల్సి ఉన్నా కానీ మహమ్మారి కారణంగా వాయిదా పడిన చిత్రాలివి. రాధే కోసం వారు అనుసరించిన పే-పర్-వ్యూ మోడల్ ను అందిస్తూ జీ బృందం చర్చలు జరిపింది. అయినప్పటికీ రాధే వైఫల్యం చూశాక అటువంటి ప్రయోగానికి ప్రయత్నించవద్దని నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఫ్యాన్సీ ధరలు చెల్లించేందుకు జీప్లెక్స్ రెడీగా లేకపోవడంతో డీల్స్ ఏవీ తెగడం లేదని తెలిసింది. ప్రస్తుతానికి అంతా థియేటర్లను తిరిగి తెరిచే వరకూ వేచి చూడాలనే ధోరణితో ఉన్నారట. లవ్ స్టోరి- విరాఠపర్వం- టక్ జగదీష్ లాంటి క్రేజీ చిత్రాలు రిలీజ్ క్యూలో ఉన్న సంగతి తెలిసిందే.