Begin typing your search above and press return to search.
2019-20 సీజన్ డౌట్ లేకుండా జీరో స్టార్స్
By: Tupaki Desk | 5 Jun 2020 4:16 AM GMTఏడాదికి రెండు మూడు సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తామని మాటిచ్చారు. కానీ ఏం లాభం? ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనం అయిపోయింది. బొత్తిగా చుక్కల్లో చంద్రుడిలా అయిపోయారు. ఎవరికీ అందనంత ఎత్తున ఉండిపోయారు. ఇది నిజంగానే ఫ్యాన్స్ ని ఎంతగా బాధించిందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
టాలీవుడ్ లో రికార్డులు తిరగరాసే సత్తా ఉన్న స్టార్లుగా ఎన్టీఆర్.. రామ్ చరణ్ పేర్లు మార్మోగుతున్నాయి. 100 కోట్ల క్లబ్.. 200 కోట్ల క్లబ్ అంటూ ఆ ఇద్దరిపైనా బోలెడంత నమ్మకం ఉంది. అయితేనేం ఆ ఇద్దరి కెరీర్ ని పరిశీలిస్తే నత్తనడకన నడుస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా 2019.. 2020 సంవత్సరాల్లో ఆ ఇద్దరూ నటించిన సినిమాలేవీ రిలీజ్ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ కోసం గంపగుత్తగా కాల్షీట్లు కేటాయించేయడంతో తలెత్తిన సమస్య ఇది. దీనికి తోడు వైరస్ మహమ్మారీ లాక్ డౌన్ సన్నివేశం అదనపు సమస్యల్ని తెచ్చి పెట్టింది.
రెండేళ్ల గ్యాప్ అంటే ఏ స్టార్ కి అయినా కష్టమే. ఈ రెండేళ్లలో ఒక్కొక్కరు రెండేసి సినిమాలు అయినా మినిమం చేసేసి ఉండేవారు. కానీ జక్కన్న ప్రాజెక్ట్ వల్ల చాలా విలువైన సమయం కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రంగస్థలం (30 మార్చి 2018) లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 2019 సంక్రాంతికి వినయ విధేయ రామ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎదురవ్వడంతో ఆ సినిమాని అభిమానులే మర్చిపోయారు. అందుకే 2019-2020 సీజన్ లో చెర్రీ జీరో అయిపోయాడు. అలాగే అరవింద సమేత (11 అక్టోబర్ 2018) లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాకా తారక్ కి రెండేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఆ ఇద్దరిపైనా భారీ అంచనాలు పెరిగాక ఇంత గ్యాప్ చూడాల్సొచ్చింది.
ప్రస్తుతం ఇరువురి ఫ్యాన్స్ తీవ్రమైన అసహనంతోనే ఉన్నారు. 2020లో రిలీజవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్ 2021 లో రిలీజవుతుంది. అది కూడా సంక్రాంతి బరిలో రావడం కష్టమేనన్న టాక్ వినిపిస్తుంటే ఫ్యాన్స్ లో అసహనం ఇంకా రెట్టింపవుతోంది. అయితే అంతా సవ్యంగా సాగితే 2021లో ఆ ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ రెండేసి సినిమాలతో ట్రీటిచ్చే వీలుంటుందని ఓ అంచనా. తారక్ ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. 2021 చివరిలో ఇది రిలీజయ్యే వీలుంటుంది. అలాగే రామ్ చరణ్ సైతం చిరు-కొరటాల సినిమాలో కీలక పాత్రలో నటించి మురిపించనున్నాడు. ఈ మూవీ 2021లోనే రిలీజవుతుంది కాబట్టి ఫ్యాన్స్ కి అది బిగ్ ట్రీట్ అనే చెప్పాలి.