Begin typing your search above and press return to search.
జియాఖాన్ ను దుర్భాషలాడి శారీరకంగాను హింసించాడు!
By: Tupaki Desk | 18 Aug 2022 4:15 AM GMTబాలీవుడ్ యువ కథానాయిక జియాఖాన్ ఆత్మహత్య 2013లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీతో జియా రిలేషన్ షిప్ వికటించి అది ఆత్మహత్యకు ప్రేరేపించిందని కథనాలొచ్చాయి. జియా ఖాన్ ను అతడు శారీరకంగా వేధించాడని.. మాటలతో హింసించేవాడని ఆమె తల్లి రబియా బుధవారం నాడు ప్రత్యేక కోర్టుకు తెలిపారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తున్న ఈ కేసులో 25 ఏళ్ల జియాఖాన్ తో సంబంధం కలిగి ఉన్న పంచోలిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం అతడు బెయిల్ పై బయట ఉన్నాడు. బుధవారం జియాఖాన్ తల్లి రబియాఖాన్ ప్రత్యేక న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ ముందు ఈ కేసులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసారు.
జియా బాలీవుడ్ లోకి ప్రవేశించాక కెరీర్ పురోగతి కోసం ప్రయత్నించింది. అయితే సూరజ్ పంచోలీతో జియాకు ఉన్న సంబంధాల గురించి రబియా ఖాన్ కోర్టుకు చెప్పారు. పంచోలి సోషల్ మీడియా సైట్ ద్వారా జియా ఖాన్ ను సంప్రదించారని.. తనను కలవాలని పట్టుబట్టారని ఆమె చెప్పారు. జియా ఖాన్ మొదట్లో ''భయపడేది.. అయిష్టంగా ఉండేది'' అయితే 2012 సెప్టెంబర్ లో ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారని రబియా ఖాన్ చెప్పారు. ''ఆ సమయంలో జియా అతడికి కొన్ని ఫోటోలను పంపింది'' వారు ఫోటోషూట్ చేశారని పరస్పరం ఆసక్తిగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. అయితే సెప్టెంబర్ లో ఆమె (జియా ఖాన్) వారు కేవలం స్నేహితులు మాత్రమే అని నాకు చెప్పారు అని చెప్పింది.
తన కూతురి దినచర్యను పంచోలీ తన చేతిలోకి తీసుకున్నారని అక్టోబర్ 2012 నాటికి ఇద్దరూ ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించారని రబియా ఖాన్ చెప్పారు. ఆ సంవత్సరం నవంబర్ లో ఆమె లండన్ లోని తమ ఇంటికి వచ్చినప్పుడు జియా చాలా సంతోషంగా కనిపించిందని ఆమె చెప్పారు. జియా ఖాన్ వృత్తిపరమైన పని కోసం ముంబైకి తిరిగి వెళ్లింది. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి తిరిగి రావాల్సి ఉంది.. కానీ రాలేదని రబియా ఖాన్ చెప్పారు.
24 డిసెంబరు 2012న పంచోలీ నుండి తనకు సందేశం వచ్చిందని స్నేహితుడితో గొడవ తర్వాత జియా ఖాన్ పై కోపం వచ్చిందని తను (జియా) నన్ను (సూరజ్ పంచోలీ) క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరినట్టు చెప్పింది. ఆ సమయంలో ఆ ఇద్దరూ హింసాత్మకంగా ఒకరితో ఒకరు తలపడినట్లు నేను కనుగొన్నాను అని ఆమె చెప్పింది. జియా ఖాన్ తనకు రెండో అవకాశం ఇవ్వాలని పంచోలీ కోరారు... ఆ తర్వాత వీరిద్దరూ గోవా వెళ్లారని రబియా ఖాన్ చెప్పారు. అయితే జియా ఖాన్ తన ఫోన్ కాల్ లలో చాలా విచిత్రమైన ప్రదేశంలో ఉన్నట్లు వెల్లడైంది. అక్కడ తాను ఉండటానికి ఇష్టపడటం లేదని ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.
గోవాలో అతను ఆమెను ఇతర స్నేహితుల ముందు పడగొట్టాడు.. జియా సమక్షంలో ఇతర మహిళలతో సరసాలాడాడు. రబియా ఖాన్ తన కుమార్తెతో ఆమె సంభాషణలను ఉదహరించారు. 14 ఫిబ్రవరి 2013న జియా ఖాన్ హఠాత్తుగా లండన్ కు వచ్చి విచారంగా కనిపించిందని రబియా ఖాన్ చెప్పారు. రబియా వివరాల ప్రకారం.. పంచోలీ తనను మాటలతో హింసించాడు. శారీరకంగా దుర్భాషలాడాడని తనను 'డర్టీ' అని దుర్భాషలాడాడని జియా ఖాన్ తనతో చెప్పినట్టు వెల్లడించింది. జియాఖాన్ తల్లి వాంగ్మూలం బుధ- గురువారాల్లో రికార్డయ్యింది.
అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం 'నిశబ్ద్'లో తన అద్భుత నటనకు జియా గొప్ప పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 3 జూన్ 2013న ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది. ఈ కేసులో బాలీవుడ్ జంట ఆదిత్య పంచోలి - జరీనా వహాబ్ ల కుమారుడు సూరజ్ పంచోలీ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. 10 జూన్ 2013న ఈ కేసును తొలిసారిగా విచారించిన ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు పేజీల నోట్ ను జియాఖాన్ రాసిందని అది ఆమెకు ఎదురైన కష్టాలను వివరించిందని సీబీఐ ఆరోపించింది. సూరజ్ పంచోలీ చేతికి జియాఖాన్ అమాయకంగా చిక్కింది. సాన్నిహిత్యం.. శారీరక వేధింపులు.. మానసిక శారీరక హింసలు ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు ఆ నోట్ లో వివరించినట్లు కేంద్ర ఏజెన్సీ తెలిపింది. దాదాపు 9 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంటుంది.