Begin typing your search above and press return to search.

కరోనాతో ఇలా అయ్యా.. నటి షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   17 April 2020 7:30 PM GMT
కరోనాతో ఇలా అయ్యా.. నటి షాకింగ్ వ్యాఖ్యలు
X
కరోనా.. కరోనా.. అందరూ భయపడిపోవడమే కానీ.. దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది అసలు బాధ. ఇక దాన్ని జయించిన వారికి కరోనా అంటే ఏంటో అసలు తెలుస్తుంది. తాజాగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటి జోయా మోరానీ తన అనుభవాలను పంచుకుంది.

కరోనా ఎంత డేంజరో చెప్పింది బాలీవుడ్ నటి జోయా మొరానీ. తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో కూడా వివరించింది.

నటి జోయా మొరానో మాట్లాడుతూ.. కరోనా సోకగానే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని సూచించింది. తాను తులసీనీళ్లు, పసుపు కలిపిన పాలు తాగానని.. యోగ చేయడం వల్ల నాలో ధైర్యం వచ్చిందని తెలిపారు.

కరోనాతో తన శరీరం పూర్తిగా దెబ్బతిందని నటి జోయా తెలిపింది. ఇప్పటికీ దగ్గు పోవడం లేదని.. మరో 14 రోజులు క్వారంటైన్ లోనే ఉంటానని వివరించింది. కరోనా అనుభవాలు నరకం అంటూ చెప్పుకొచ్చింది.