Begin typing your search above and press return to search.
సీక్వెల్'కు సిద్ధం అవుతున్న జాంబిరెడ్డి..!
By: Tupaki Desk | 11 May 2021 5:30 AM GMTతెలుగు ఇండస్ట్రీలో జాంబీస్ అనే జానర్లో రూపొందిన ఫస్ట్ సినిమా జాంబీరెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి మంచి హిట్ అందుకుంది. అలాగే ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ పరంగా మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఓవైపు టాక్ మరోవైపు కలెక్షన్స్ తో మొత్తానికి జాంబిరెడ్డి ప్రయత్నం సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాను టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా డెబ్యూ ప్రొడ్యూసర్ రాజశేఖరవర్మ సినిమాని నిర్మించారు. నిజానికి 'అ!' అనే డిఫరెంట్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మొదటి సినిమాతోనే అవుట్ ఆఫ్ బాక్స్ సినిమాలు తీయగలడని ప్రూవ్ చేసుకున్నాడు.
ఆ తర్వాత సెకండ్ మూవీగా కల్కి తెరకెక్కించాడు. ఆ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది కానీ ఫలితం నిరాశపరిచింది. అనంతరం ప్రశాంత్ మూడో మూవీగా 'జాంబీరెడ్డి'ని రూపొందించాడు. ఈ సినిమా ఇండియాలోనే ఫస్ట్ జాంబిస్ మూవీ కావడం విశేషం. అందులోను విడుదలై సక్సెస్ అవ్వడం మరో విశేషం. అయితే ఫస్ట్ నుండి జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారని దర్శకుడు గట్టినమ్మకంతో ఉన్నాడు. నిజానికి జాంబీరెడ్డి సినిమాలో స్టార్ యాక్టర్స్ ఎవరూ లేరు. హీరో తేజసజ్జా కథానాయకుడుగా నటించినప్పటికి అతను చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఇదే సినిమాతో హీరోగా మారాడు.
కానీ సినిమా అవసరానికి తగ్గట్టుగా ఖర్చుపెట్టి సినిమాను కంప్లీట్ చేసినట్లు చూస్తేనే అర్ధమవుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే.. జాంబీస్ అనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ జాంబీరెడ్డి థియేటర్లలో ఎలా ఉండబోతుంది.. అసలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయింది హిట్ కొట్టింది. ఫుల్ ఫన్ తో పాటు థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించాడు ప్రశాంత్. అయితే జాంబిరెడ్డి సమయంలోనే ఈ ప్రయత్నం సక్సెస్ అయితే జాంబిస్ నేపథ్యంలో సీక్వెల్ తెరకెక్కిస్తానని చెప్పాడట. చెప్పినట్లుగానే ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి త్వరలోనే ఈ సీక్వెల్ పై క్లారిటీ రాబోతుందని టాక్.