Begin typing your search above and press return to search.

సినిమాల వల్ల సెక్స్‌ అనేది తప్పుగా మారింది

By:  Tupaki Desk   |   10 March 2019 1:30 AM GMT
సినిమాల వల్ల సెక్స్‌ అనేది తప్పుగా మారింది
X
ఒక అమ్మాయి - అబ్బాయి వారి వారి ఇష్టంతో ముద్దు పెట్టుకున్నా - శృంగారంలో పాల్గొన్నా కూడా దాన్ని తప్పుగా ఇప్పుడు సమాజం చూస్తుంది. వారిని తప్పు చేశారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టపడి చేసిన పని ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు అనేది ఈ జనాలు మర్చి పోతున్నారు. జనాలు మర్చి పోవడానికి ప్రధాన కారణం సినిమాలే అంటోంది బాలీవుడ్‌ దర్శకురాలు జోయా అక్తర్‌. ఈమె మాటలు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

మొదటి నుండి కూడా హిందీ సినిమాలైనా మరే భాష సినిమాలు అయినా కూడా ముద్దు లేదా శృంగారం అనే వాటిని తప్పుగా చూపించడం జరిగింది. అలా చేసిన వారు తప్పు చేసినట్లుగా సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. సినిమాలో ఎప్పుడు కూడా శృంగారంను రేప్‌ గానో లేదంటో లైంగికంగా వేదించడమో చూపించారు. అంతే తప్ప ఇద్దరి అంగీకారంతో జరిగిన శృంగారం తప్పు కాదని చూపించే ప్రయత్నం చేయలేదు. అందుకే సమాజంలో ఇప్పుడు శృంగారం అనేది ఒక తప్పుగా మారిపోయింది.

నేను చిన్నప్పటి నుండి చూస్తున్న సినిమాలన్నింటిలో కూడా ఫిజిల్‌ అబ్యూస్‌ - రేప్‌ లను మాత్రమే చూపిస్తూ వస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అంతా కూడా దాన్నే ఫాలో అవుతూ వస్తున్నారు. ఇద్దరి ఒప్పందంతో జరిగే సెక్స్‌ సమాజం అంగీకరించాలి, అంతా ఒప్పుకోవాలని సినిమాలు ఎప్పుడు కూడా చెప్పలేదు. అందుకే సమాజంలో ఇలాంటి నేర ప్రవృత్తి పెరిగిందని - శృంగారం తప్పు అనే భావన కలగడానికి ప్రధాన కారణం సినిమాలే అంటూ దర్శకురాలు అయిన జోయా అక్తర్‌ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గల్లీ బాయ్‌ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ ను దక్కించుకున్న జోయా అక్తర్‌ దర్శకత్వంలో నటించేందుకు పలువురు స్టార్స్‌ ఆసక్తి చూపుతున్నారు. క్రేజీ దర్శకురాలిగా మారిన జోయా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె కెరీర్‌ పై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.