Begin typing your search above and press return to search.
లక్కీ లవ్ స్టోరీ : ట్రైలర్ టాక్
By: Tupaki Desk | 29 Aug 2019 10:17 AM GMTఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేయడం ఓ ట్రెండ్ గా మారింది. అందులో భాగం వస్తోందే జోయా ఫాక్టర్. మలయాళం స్టార్ నటుడు మహానటితో ఇక్కడా మెప్పులు పొందిన దుల్కర్ సల్మాన్ హీరో కాగా సోనం అహుజా కపూర్ టైటిల్ రోల్ చేస్తోంది. ఇందాకా ట్రైలర్ రిలీజ్ చేశారు.కథ విషయానికి వస్తే ఇండియా మొట్టమొదటి వరల్డ్ కప్ గెలిచిన రోజే జోయా సోలంకి(సోనం అహుజా)పుడుతుంది. దీంతో అందరూ తనను అదృష్ట దేవతగా భావిస్తారు. కాని నిజ జీవితంలో జోయా వెనుక దురదృష్టం వెంటపడుతూ ఉంటుంది.
ఏ జాబ్ చేసినా ఎక్కువ కాలం ఉండలేకపోతుంది. ఈ క్రమంలో వర్తమాన భారత క్రికెట్ జట్టుతో కలిసి పని చేసే అవకాశం దక్కుతుంది. అక్కడ పరిచయమవుతాడు టీం కెప్టెన్ నిఖిల్(దుల్కర్ సల్మాన్). జోయా బ్యాడ్ లక్ వీళ్ళను వెంటాడుతుంది. కాని అనూహ్యంగా ఓ రోజు జోయా అదృష్ట దేవతగా మారిపోతుంది. తాను ఎక్కడుంటే అక్కడ విజయాలు వరించడం మొదలవుతాయి. దీంతో తనో దేవతగా మారిపోతుంది. ఇక అక్కడి నుంచి జోయా జీవితం ఏ మలుపులు తిరిగిందో అదే కథ
ట్రైలర్ ని బట్టి చూస్తే ఇందులో ఎన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా మిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. మసాలా అంశాలు లేకపోయినా ఎంటర్ టైన్మెంట్ కి ఏ లోటు లేకుండా దర్శకుడు అభిషేక్ శర్మ కథను ప్రెజెంట్ చేసిన తీరు ఆసక్తి రేపేలా ఉంది. సోనం అహుజా కపూర్ మొత్తం డామినేషన్ చేయగా దుల్కర్ సైతం తనదైన టైమింగ్ తో ఉనికిని చాటుకున్నాడు. సున్నితమైన హాస్యం జోయా ఫ్యాక్టర్ లో హై లైట్ అయ్యింది. శంకర్ - ఎహసాన్ - లాయ్ సంగీతం మనోజ్ లోబో ఛాయాగ్రహణం ప్లస్ అయ్యాయి. ఎంటర్ టైన్మెంట్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్న జోయా ఫాక్టర్ సెప్టెంబర్ 20న విడుదల కానుంది