ఆర్టికల్ 370 టీజర్: కాశ్మీర్ తీవ్రవాదం వెనక కొత్త కోణం?
ముఖ్యంగా కశ్మీర్ తీవ్రవాదం వెనక కొత్త కోణం ఆశ్చర్యపరుస్తోంది. జిహాదీ పేరుతో కశ్మీర్‌లో సాగించే భారీ వ్యాపారం గురించి ఇందులో చర్చించారు.
By: Tupaki Desk | 22 Jan 2024 5:00 AM GMTకాశ్మీర్ హింస, తీవ్రవాదంపై ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. వాటన్నిటి కంటే భిన్నమైన ఓ సినిమాని ఇప్పుడు చూడబోతున్నామా? అంటే అవుననేందుకు ఈ టీజర్ ఆస్కారం కల్పిస్తోంది. ఆర్టికల్ 370 టీజర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. ఇందులో ప్రధాన పాత్రధారి యామి గౌతమ్ పరిచయం అవసరం లేదు. యుద్ధం సినిమాలో తరుణ్- శ్రీహరి లాంటి స్టార్లతో కలిసి నటించింది. అయితే తెలుగులో ఈ భామ కెరీర్ ఆశించిన స్థాయిలో వెలగలేదు. కానీ బాలీవుడ్‌లో విక్కీ డోనర్, కాబిల్ లాంటి సినిమాలతో నటిగా నిరూపించుకుని కెరీర్ పరంగా ఎదురేలేని స్థాయిలో ఉంది ఈ బ్యూటీ. తాజాగా జియో స్టూడియోస్- B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ డ్రామా `ఆర్టికల్ 370` పల్స్-పౌండింగ్ టీజర్‌ను విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించింది.
ముఖ్యంగా కశ్మీర్ తీవ్రవాదం వెనక కొత్త కోణం ఆశ్చర్యపరుస్తోంది. జిహాదీ పేరుతో కశ్మీర్‌లో సాగించే భారీ వ్యాపారం గురించి ఇందులో చర్చించారు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, తీవ్రవాదం ఇవన్నీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. యామీ గౌతమ్ ఇందులో ఛాలెంజింగ్ ఏజెంట్ పాత్రలో నటిస్తోంది.
టీజర్ వీక్షించాక ఇది ఒక అడ్రినలిన్ పంపింగ్ పేట్రియాటిక్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన `ఆర్టికల్ 370` కొన్ని పవర్‌హౌస్ ప్రదర్శనలతో గగుర్పొడిచే యాక్షన్ కంటెంట్ తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. యామి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
ఆర్టికల్ 370లో హింస, తీవ్రవాదం చుట్టూ పూర్తి భిన్నమైన కోణాన్ని వెలికి తీస్తున్నారని టీజర్ చెబుతోంది. టీజర్ లో కొన్ని రహస్య సంఘటనల గొలుసు రియాక్షన్ కి ఏజెంట్ యామి ఎలా స్పందించారు? అన్నది ఆవిష్కరించారు. ఆర్టికల్ 370 గురించి యామీ గౌతమ్ మాట్లాడుతూ, ``ఆర్టికల్ 370 భారతదేశ చరిత్రలో ఒక సాహసోపేతమైన అధ్యాయం. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన రాజకీయ-యాక్షన్-డ్రామా ఇది. ఇది దేశ గమనాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి తెలివితేటలు, రాజకీయాలు ఎలా చేతులు కలుపుతాయి? అనే దాని గురించి లోతైన విషయాల్ని తెరపై చూపించారు. ఈ జానర్‌ను నిర్వచించే గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా, నటిగా నాకు ఈ చిత్రం సంక్లిష్టతలలోని కొత్త లోతులను పరిశోధించడానికి నాకు అవకాశం ఇచ్చింది. ఇంతకు ముందు నేను చేయని మరో పాత్రలో నటించే అవకాశం లభించింది`` అని తెలిపింది.