వయస్సుతో పాటు ఈమె అందం పెరిగిపోతోంది
అలాగే పాన్ ఇండియా బ్రాండ్ తో సినిమాలు చేస్తూ ఉండటంతో ఇతర భాషలకి చెందిన నటీమణులని క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా తీసుకుంటున్నారు
By: Tupaki Desk | 2 Nov 2023 4:05 AM GMTఒకప్పుడు టాలీవుడ్ లో సిస్టర్ క్యారెక్టర్స్ తో కేరాఫ్ అడ్రెస్ గా మారిన నాటిన ప్రియ. ఈ బ్యూటీ చాలా క్యాజువల్ లుక్స్ తో ఇంట్లో అమ్మాయి తరహాలో కనిపిస్తూ అందరిని ఆకట్టుకునేది. అయితే పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న ఈమె కంప్లీట్ గా లుక్ మార్చుకొని తల్లి పాత్రల ద్వారా మరల రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్ లో మాత్రం ప్రియ ఒకప్పటి పక్కింటి అమ్మాటి తరహా లుక్ లో కాకుండా మోడరన్ దేవతగా మారిపోయింది.
వైబ్రెంట్ గా హాట్ లుక్స్ తో కుర్రకారుని ఇట్టే ఆకట్టుకుంది. ఆమె అందానికి అందరూ దాశోహం అయిపోయారు. గ్లామర్ మదర్, క్యారెక్టర్స్ తో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్య సినిమాలలో తల్లి పాత్రలకి కూడా ఒకప్పటి హీరోయిన్స్ ని దించేయడంతో వీరికి అవకాశాలు తగ్గాయి
అలాగే పాన్ ఇండియా బ్రాండ్ తో సినిమాలు చేస్తూ ఉండటంతో ఇతర భాషలకి చెందిన నటీమణులని క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సీనియర్ బ్యూటీ సీరియల్స్ లో తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్ లో సీరియల్స్ ముందుగా స్టార్ట్ చేసి సినిమాలలోకి వచ్చిన ఈ భామ మళ్ళీ సీరియల్స్ లో బిజీ అవుతోంది.
ప్రస్తుతం కృష్ణ ముకుందా మురారీ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ప్రియకి ఇన్ స్టాగ్రామ్ లో హీరోయిన్ రేంజ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె షేర్ చేసే గ్లామర్ ఫోటోలని చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తన ఫాలోవర్స్ కోసం రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఓ హాట్ లుక్స్ తో ఫోటో షేర్ చేసింది.
ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. క్యాజువల్ నైట్ డ్రెస్ లో టీ గ్లాస్ చేతితో పట్టుకొని స్టైలిష్ గా దిగిన స్టిల్స్ ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోలని నెటిజన్లు నుంచి ఇంటరెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. వయస్సు పెరిగిన మీ అందం కూడా పెరిగిపోతూ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.