బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సీఎం సపోర్ట్..!
బిగ్ బాస్ హిందీ సీజన్ 18 మరో వారం లో ముగుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
By: Tupaki Desk | 11 Jan 2025 3:53 AM GMTనేషనల్ లెవెల్ లో భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్. హిందీలో మొదలై అన్ని ప్రాంతీయ భాషలకు అది విస్తరించింది. ఈ మధ్యనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే బిగ్ బాస్ హిందీ మాత్రం 18వ సీజన్ నడుస్తుంది. 17 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకుని 18వ సీజన్ కూడా ముగింపుకు చేరుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న హిందీ బిగ్ బాస్ కి నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఉంది.
బిగ్ బాస్ హిందీ సీజన్ 18 మరో వారం లో ముగుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన చుమ్ దరాంగ్ అనే మహిళ ఉంది. ఐతే ఇంత ప్రెస్టీజియస్ షోలో తమ రాష్ట్ర మహిళ టాప్ 9 దాకా వెళ్లినందుకు ఆమెకు సపోర్ట్ గా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. సీఎం తన సపోర్ట్ ను ఇన్ స్టాగ్రాం ద్వారా ప్రకటించారు. రియాలిటీ షో లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన చుమ్ దరాంగ్ టాప్ 9 లో ఉండటం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరు ఆమెకు ఓటు వేయాలని ఆయన అన్నారు. ఆమె విజేతగా నిలవాలని చుమ్ దరాంగ్‌కి నా శుభాకాంక్షలు అంటూ సీఎం పెమా ఖండు సోషల్ మీడియా పోస్ట్ అందరికీ సర్ ప్రైజ్ చేసింది.
సీఎం సపోర్ట్ కు చుమ్ దరాంగ్ టీం కూడా స్పందించారు. గౌరవనీయులైన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మద్ధతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఆమె ప్రయాణాం ఈశాన్య భారదేశాన్ని గర్వించేలా చేసిందని.. ప్రతిష్టాత్మక వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం ప్రపంచ దృష్టికి తీసుకెళ్తాయని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఒక రాష్ట్ర సీఎం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేయడం పట్ల నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. రాష్ట్ర పౌరులను ఆమెకు సపోర్ట్ చేయాలని ఏకంగా సీఎం కోరడం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. బిగ్ బాస్ హిందీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ సందర్భంతో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ జనవరి 19న టెలికాస్ట్ అవుతుంది.