హీరోయిన్ ఆరోగ్యం అత్యంత విషమం
తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు దక్కించుకున్న అరుంధతి నాయర్ కి మార్చి 14న యాక్సిడెంట్ జరిగిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 22 March 2024 4:02 AM GMTతమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు దక్కించుకున్న అరుంధతి నాయర్ కి మార్చి 14న యాక్సిడెంట్ జరిగిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి కూడా అరుంధతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ఇటీవల ఆమె సన్నిహితులు మరియు స్నేహితులు చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం కోసం ఫండ్ రైజింగ్ ను కూడా మొదలు పెట్టారు. ఆమె ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమెకు సంబంధించిన వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
మరో వైపు అరుంధతి ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ వైద్యులు ప్రకటించారు. ఆమె చికిత్సకి స్పందించడం లేదు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అరుంధతి ని కాపాడేందుకు వైద్యులు సాధ్యం అయినంత వరకు ప్రయత్నం చేస్తున్నారట.
విజయ్ ఆంటోనీ తో కలిసి నటించిన భేతాళుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా అరుంధతి నాయర్ సుపరిచితురాలు. ఇంకా ఈమె పలు తమిళ మరియు మలయాళం సినిమాల్లో నటించింది. సోదరుడితో బైక్ పై వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ కి గురి అయిన అరుంధతి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.