ఆరెంజ్ లానే ఆ సినిమా క్లిక్ అవుతుందా..?
అదేంటి ఒకే సినిమా స్ట్రైట్ రిలీజ్ చేస్తే ఫ్లాప్ రీ రిలీజ్ టైం లో హిట్టు అదెలా అంటే.. అప్పుడు సినిమాను అర్ధం చేసుకోలేని ఫ్యాన్స్ అర్రె మనం ఒక మంచి క్లాసిక్ సినిమాను ఫ్లాప్ చేశామన్న ఆలోచన వస్తుంది.
By: Tupaki Desk | 1 April 2025 2:30 AMఈమధ్య స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు సూపర్ హిట్టైన సినిమా రీ రిలీజ్ అంటే ఒక రేంజ్ క్రేజ్ ఉండేది కానీ ఈమధ్య ఫ్యాన్స్ అప్పుడు ఫ్లాపైన సినిమా రీ రిలీజ్ ని కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటి ఒకే సినిమా స్ట్రైట్ రిలీజ్ చేస్తే ఫ్లాప్ రీ రిలీజ్ టైం లో హిట్టు అదెలా అంటే.. అప్పుడు సినిమాను అర్ధం చేసుకోలేని ఫ్యాన్స్ అర్రె మనం ఒక మంచి క్లాసిక్ సినిమాను ఫ్లాప్ చేశామన్న ఆలోచన వస్తుంది. దాని వల్ల రీ రిలీజ్ టైం లో అలాంటి సినిమాలకు సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది.
అలా వచ్చి రీ రిలీజ్ టైంలో రికార్డ్ అందుకున్న సినిమాల లిస్త్ లో అరెంజ్ ఉంది. రామ్ చరణ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన ఆరెంజ్ సినిమా అప్పుడు అంచనాలను అందుకోలేదు. అప్పుడు సినిమాను కాదన్న ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆహా ఓహో అనేస్తున్నారు. సినిమా అప్పుడు జనాలకు ఎందుకు ఎక్కలేదు ఇప్పుడు ఎందుకు నచ్చుతుంది అన్నది చెప్పడం కష్టమే. కానీ ఆరెంజ్ రీ రిలీజ్ హిట్ తో ఇలా అంచనాలతో వచ్చి ఫ్లాపైన సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
అది కూడా హిట్ అయ్యే కంటెంట్ ఉండి ఆడియన్స్ ఆదరణకు నోచుకోని సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఆర్య 2 ని రీ రిలీజ్ చేయబోతున్నారట. ఆర్య తో సూపర్ హిట్ కాంబోగా ఏర్పడ్డ సుక్కు, అల్లు అర్జున్ చేసిన రెండో ప్రయత్నం అది. ఐతే ఆ సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా కొంతమంది ఆడియన్స్ కి నచ్చింది. ఐతే రీ రిలీజ్ లో సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఆర్య 2 ఒక మంచి లవ్ స్టోరీ.. ఫ్రెండ్ కోసం ప్రేమను త్యాగం చేసే హీరో కథ. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటుంది. ఐతే సినిమా ఆర్య రేంజ్ హిట్ కాలేదు. అఫ్కోర్స్ దేవి పాటలు నెక్స్ట్ లెవెల్ అనిపించినా ఎందుకో సెన్సేషన్ అవ్వలేదు. అందుకే రీ రిలీజ్ తో ఆర్య 2 సక్సెస్ చేయాలని చూస్తున్నారు. అల్లు ఫ్యాన్స్ కూడా ఆర్య 2 రీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సో ఆరెంజ్ తర్వాత ఆర్య 2 రీ రిలీజ్ తో రికార్డులు కొడుతుందేమో చూడాలి.