Begin typing your search above and press return to search.

త‌ల్లిదండ్రుల పాత ఇంటి కోసం ఆర్య‌న్ 37 కోట్లు పెట్టాడు!

తాజా మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. తన తండ్రి షారూఖ్ - తల్లి గౌరీ ఖాన్ ఒకప్పుడు నివ‌శించిన దక్షిణ ఢిల్లీలోని భవనంలో రూ.37 కోట్ల విలువైన రెండు అంతస్తులను కొనుగోలు చేశాడు.

By:  Tupaki Desk   |   30 July 2024 1:30 AM GMT
త‌ల్లిదండ్రుల పాత ఇంటి కోసం ఆర్య‌న్ 37 కోట్లు పెట్టాడు!
X

అతడు ఇంకా అప్‌క‌మ్ ద‌ర్శ‌కుడు. త‌న తొలి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇది విడుద‌లకు రావాల్సి ఉండ‌గా, ఇంత‌లోనే అత‌డి పేరు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మార్మోగుతోంది. ఇంత‌కీ ఎవ‌రా యంగ్ డైరెక్ట‌ర్ అంటే.. పేరు ఆర్య‌న్ ఖాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడిగా సుప‌రిచితుడు. ఆర్యన్ ఇప్పుడు 37 కోట్ల మేర‌ పెట్టుబ‌డులు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు ఇటీవ‌ల‌ ఢిల్లీతో తన బంధాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాడు. తాజా మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. తన తండ్రి షారూఖ్ - తల్లి గౌరీ ఖాన్ ఒకప్పుడు నివ‌శించిన దక్షిణ ఢిల్లీలోని భవనంలో రూ.37 కోట్ల విలువైన రెండు అంతస్తులను కొనుగోలు చేశాడు.

ఎకనామిక్ టైమ్స్ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. పేరెంట్ నివ‌శించిన‌ గ్రౌండ్ ఫ్లోర్ , బేస్మెంట్ కలిగి ఉన్న ఢిల్లీలోని పంచశీల్ పార్క్‌లోని ఆస్తిని ఆర్యన్ కొనుగోలు చేశాడు. మే 2024లో రిజిస్టర్ అయిన లావాదేవీలో ఆర్యన్ రూ.2.64 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించాడు. ఈ భవనంలో షారూఖ్‌-గౌరీ తమ జీవితం ప్రారంభం ద‌శ‌లో నివ‌శించారు. ఇప్పుడు త‌మ త‌ల్లిదండ్రుల జీవితాల్లోని భావోద్వేగాల‌తో ముడిప‌డి ఉన్న ఆ నివాసాన్ని ఆర్య‌న్ కొనుగోలు చేయ‌డం సెంటిమెంటుగా మారింది. నిజానికి ఈ ఇంటిని ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అయిన‌ గౌరీ స్వయంగా డిజైన్ చేసార‌ని కూడా తెలుస్తోంది.

నిజానికి హిందీ స్టార్లు అంతా ముంబైలోనే ఆస్తుల‌ను కొనుగోలు చేస్తుంటారు. దిల్లీలో చాలా అరుదు. అంతకుముందు అమితాబ్ బచ్చన్ దక్షిణ ఢిల్లీలోని తన గుల్మోహర్ పార్క్ ఆస్తిని సుమారు రూ.23 కోట్లకు విక్రయించారు! అని బోటిక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ వెల్త్‌వైసరీ క్యాపిటల్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

షారుఖ్ పిల్లలు సుహానా ఖాన్ - ఆర్యన్ ఖాన్ ఇటీవలి కాలంలో ప‌లుమార్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడం ఆసక్తిని క‌లిగిస్తోంది. గత ఏడాది జనవరిలో సుహానా మహారాష్ట్రలోని తీరప్రాంత పట్టణమైన అలీబాగ్‌లో వ్యవసాయ భూమిని రూ.12.91 కోట్లకు కొనుగోలు చేసింది. ఏడాది ముగిశాక ఫిబ్రవరి 2024లో ముంబైకి సమీపంలో బీచ్ ఫ్రంట్ ఆస్తిని కొనుగోలు చేసింది. బీచ్ ఫేసింగ్ ప్రాపర్టీకి స్టాంప్ డ్యూటీ ఛార్జీలు సహా రిజిస్ట్రేష‌న్ కు రూ.10 కోట్లకు పైగా ఖర్చయింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... సుహానా ఇంత‌కుముందు జోయా అక్తర్ `ది ఆర్చీస్‌`తో న‌టిగా ప‌రిచ‌యం అయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రం సుజోయ్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వంలోని `ది కింగ్‌`. ఇందులో షారూఖ్‌తో క‌లిసి న‌టించ‌నుంది. ఇదిలా ఉంటే ఆర్యన్ స్టార్ డమ్ అనే వెబ్ షోతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్ర‌స్తుతం ఇది చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.