Begin typing your search above and press return to search.

పార్టీలో స్టార్ కిడ్ గాళ్ ఫ్రెండ్ దాగుడుమూత‌లు

ఆర్యన్ ఖాన్ నుండి డి-యావ‌ల్ ఎక్స్ జాకెట్ రూపంలో బహుమతిని అందుకున్నారు. ఈ బ‌హుమ‌తి త‌ర్వాత లారిస్సాతో ఆర్య‌న్ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లకు ఆజ్యం పోసింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 12:44 PM GMT
పార్టీలో స్టార్ కిడ్ గాళ్ ఫ్రెండ్ దాగుడుమూత‌లు
X

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ వార‌సులు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ ఇటీవ‌ల నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ముంబైలో పార్టీ నైట్ సెల‌బ్రేష‌న్ కార‌ణంగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఈ పార్టీలో ఆర్యన్ ప్రియురాలు లారిస్సా బోనేసీ కూడా ఉండ‌డం మీడియాలో హైలైట్ అయింది. ఆన్‌లైన్‌లో షేర్ అయిన‌ వీడియోలలో ఆర్యన్ - సుహానా కలిసి పార్టీ వెన్యూ వ‌ద్ద‌కు చేరుకోగా..లారిస్సా వారితో కలిసిపోయి పార్టీని ఎంజాయ్ చేయ‌డం కెమెరా కంటికి చిక్కింది. పార్టీని ఆర్యన్ దుస్తుల బ్రాండ్ డి యావోల్ ఎక్స్ సహ-హోస్ట్ చేసింది. ఈ పార్టీలో లారిస్సా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ ఫోటోగ్రాఫ‌ర్లు షేర్ చేసిన వీడియోలో ఆర్యన్ డెనిమ్ జాకెట్ తో బ్లాక్ టీష‌ర్ట్ ధరించి క‌నిపించ‌గా.. సుహానా బ్లాక్ బాడీ హగ్గింగ్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. ఈ ఈవెంట్‌లో స్టార్ డాట‌ర్ గ్లామర్‌ కనువిందు చేసింది. లారిస్సా కొద్దిగా నలుపు రంగు దుస్తులు ధరించి సింపుల్‌గా క‌నిపించినా చాలా స్పెష‌ల్ గా స్ట్రైకింగ్ గా క‌నిపించింది. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల ముందు సుహానా- ఆర్యన్ కలిసి పోజులివ్వగా, లారిస్సా కెమెరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం సందేహం రేకెత్తించింది.

లారిస్సాతో ఆర్యన్ డేటింగ్ గురించి పుకార్లు 2024 జ‌న‌వ‌రిలో రెడ్డిట్‌లో ప్రారంభమయ్యాయి. ఆర్యన్ సోష‌ల్ మీడియాల్లో లారిస్సాను, ఆమె తల్లి రెనాటా బోనేసిని అనుసరిస్తున్నట్లు గమనించిన తర్వాత ఆర్యన్ -లారిస్సా డేటింగ్‌లో ఉన్నారంటూ నెటినులు పేర్కొన్నారు. రెనాటా ఇటీవల ముంబైలో ఉంటున్నారు. ఆర్యన్ ఖాన్ నుండి డి-యావ‌ల్ ఎక్స్ జాకెట్ రూపంలో బహుమతిని అందుకున్నారు. ఈ బ‌హుమ‌తి త‌ర్వాత లారిస్సాతో ఆర్య‌న్ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లకు ఆజ్యం పోసింది.

లారిస్సా బ్రెజిలియన్ మోడల్ కం నటి. హిందీ - తెలుగు చిత్రాలలో న‌టించింది. అక్షయ్ కుమార్ - జాన్ అబ్రహం దేశీ బాయ్జ్ పాట సుబా హోనే నా దేలో న‌ర్తించింది. సైఫ్ అలీ ఖాన్ స్టార్టర్ గో గోవా గాన్‌లో కూడా ఆమె చిన్న పాత్ర పోషించింది. తెలుగులో సాయి ధరమ్ తేజ్ తిక్కలో క‌థానాయిక‌గా న‌టించింది. మోడల్‌గా, లారిస్సా ఓలే, లాంకోమ్ మరియు లెవీస్ వంటి బ్రాండ్స్ ప్రకటనల ప్రచారాల్లో కనిపించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆర్యన్ ఖాన్ తన తొలి సిరీస్ 'స్టార్‌డమ్' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సుహానా తన తండ్రి, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి ఓ సినిమా చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి కింగ్ అనే టైటిల్ వినిపిస్తోంది. దీనిపై మ‌రింత స‌మాచారం రావాల్సి ఉంది.