హిట్టు కొట్టినా లక్కు లేదేంటో..?
కన్నడలో ఆల్రెడీ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న అమ్మడు తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
By: Tupaki Desk | 26 Nov 2024 4:25 AM GMTఅదేంటో కొంతమంది భామలకు హిట్లు లేకపోయినా సరే వరుస అవకాశాలు వస్తాయి కానీ కొంతమందికి మాత్రం సూపర్ హిట్ పడ్డాక కూడా పెద్దగా ఛాన్సులు రావు. వాళ్లను అన్ లక్కీ అనుకోవాలో లేక వస్తున్నా సరే వాటిని వీళ్లే కాదంటున్నారో కూడా తెలియట్లేదు. ఇలా అన్ లక్కీ హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉండగా కొత్తగా వారిలో కన్నడ భామ ఆషిక రంగనాథ్ జాయిన్ అయ్యింది. కన్నడలో ఆల్రెడీ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న అమ్మడు తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా పేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఐతే లాస్ట్ ఇయర్ కింగ్ నాగార్జునతో కలిసి నా సామిరంగ సినిమాలో నటించింది అమ్మడు. ఆ సినిమాలో అమ్మడి లుక్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. నా సామిరంగ హిట్ కొట్టాక మామూలుగా అయితే ఈ పాటికి ఆషిక ఒక మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసి ఉండాలి.. ఒకటి రెండు సినిమాలు సెట్స్ మీద ఉండాలి. కానీ ఎందుకో అమ్మడి విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. అవకాశాలు అనుకున్న స్థాయిలో రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో అది కూడా చిరుకి సిస్టర్ రోల్ చేస్తుందని టాక్. మరి హిట్టు కొట్టినా కూడా ఆషికాకు ఎందుకు ఛాన్సులు రావట్లేదు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఐతే తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా ప్రయత్నాలు చేస్తున్న ఆషికాకు అక్కడ ఆశించిన స్థాయిలో ఛాన్సులు రాలేదు. ఈమధ్యనే సిద్ధార్థ్ తో మిస్ యు సినిమా చేసింది ఆషిక. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.
అరకొర ప్రమోషన్స్ తోనే మిస్ యు సినిమా వస్తుంది. మరి ఆషికాకు ఆ సినిమా నిజంగానే సక్సెస్ అందిస్తుందా. దానితో పాటు మరిన్ని ఛాన్సులు రాబట్టేలా చేస్తుందా అన్నది చూడాలి. సినిమాలేమో కానీ సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఆషిక తన సత్తా చాటుతుంది. ఐతే అవి ఎందుకో అవకాశాలను తెచ్చిపెట్టలేకపోతున్నాయి. ఆషిక రంగనాథ్ కు సరైన ఛాన్స్ వస్తే మరోసారి తన టాలెంట్ చూపించాలని చూస్తుంది. మరి ఆ లెక్కా ఛాన్స్ ఏంటన్నది చూడాలి.
మెగా విశ్వంభర సినిమాలో త్రిష, మీనాక్షి తో పాటు ఆషిక నటిస్తుంది. మరి వాళ్లిద్దరిని దాటి ఆమెకు క్రేజ్ వస్తుందని చెప్పడం కష్టం. హిట్ ఫాం లో ఉన్నప్పుడే ఆషిక సరైన నిర్ణయం తీసుకోవాలి మరి ఎందుకు అమ్మడు ఆలోచిస్తుందో తెలియాల్సి ఉంది.