Begin typing your search above and press return to search.

నా సామి రంగ.. ముద్దుగుమ్మ సముద్రంపై సాహసాలు

ఇప్పుడు సముద్రంపై తాను చేసిన సాహసంకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్‌ చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 7:30 PM GMT
నా సామి రంగ.. ముద్దుగుమ్మ సముద్రంపై సాహసాలు
X

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్‌ 2016లో క్రేజీ బాయ్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట్లో పూర్తిగా కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ అమ్మడు 2022లో మొదటి సారి తమిళ్‌ మూవీని చేసింది. పట్టతు ఆసరన్‌ అనే సినిమాను చేసిన ఈ అమ్మడు అక్కడ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కన్నడంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు తమిళ్‌ నుంచి వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంది. తెలుగులో ఈ అమ్మడు అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్‌ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన విషయం తెల్సిందే.

తెలుగులో చాలా అంచనాల నడుమ అడుగు పెట్టిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఈ అమ్మడు టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే ఫ్లాప్‌ గా నిలవడంతో మళ్లీ ఆఫర్లు వస్తాయా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే అనూహ్యంగా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జునకు జోడీగా నా సామి రంగ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించింది. వయసు ఎక్కువ ఉన్న పాత్రలో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఆ పాత్రకు తగిన న్యాయం చేసింది అంటూ ప్రశంసలు దక్కించుకుంది. అయితే నా సామి రంగ సినిమా సైతం బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో మరో ఆఫర్‌ కోసం చాలా సమయం పట్టింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో కీలక పాత్రలో ఈమె కనిపిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్న విషయం తెల్సిందే. కనుక ఆషికా రంగనాథ్‌ విశ్వంభర సినిమాలో చిరంజీవికి సోదరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఆషికా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సముద్రంపై తాను చేసిన సాహసంకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్‌ చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది.

సముద్రంపై సర్ఫింగ్‌ చేసిన ఈ అమ్మడు.. మీరు పని నుండి ఒక రోజు సెలవు పొంది, సరదాగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా చేయండి. అద్భుతమైన క్షణాలను చూడటానికి ఎడమవైపుకి స్వైప్ చేయండి! మేము మొదటిసారి సర్ఫింగ్ చేసాము మరియు ఇది చాలా సరదాగా మరియు ఉల్లాసంగా ఉంది! మొదటి ప్రయత్నంలోనే ఇంత బాగా రాణించగలమని అనుకోలేదు. మా కోచ్‌లకు ధన్యవాదాలు. ఇలాంటి కొత్త సాహసం మరియు అనుభవంతో ప్రయత్నించడాన్ని ఇష్టపడుతాను అంటూ కొన్ని వీడియోలు, ఫోటోలను షేర్‌ చేసింది.