ఆషిక రంగనాథ్.. స్లీవ్‌లెస్ టచ్‌తో చీరకట్టు
అమిగోస్ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ, మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
By: Tupaki Desk | 21 Nov 2024 3:15 AM GMTకన్నడ చిత్రపరిశ్రమ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆషిక రంగనాథ్, తన అందం, అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటోంది. అమిగోస్ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ, మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ‘ఎన్నో రాత్రులు’ పాటలో తన అందం, డ్యాన్స్‌తో యూత్‌ను ఫిదా చేసింది.
సినిమాలో ఆమె నటన కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకోవడంతో, తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకుంది. ఆ తర్వాత నాగార్జున సరసన ‘నా సామి రంగ’ చిత్రంలో వరలక్ష్మి పాత్రలో కనిపించి, తన నటనతో మెప్పించింది. ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్లో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఆషిక తెలుగుతో పాటు కన్నడ చిత్రపరిశ్రమలోనూ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.
చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఆషిక, తన కెరీర్‌ను మరో లెవెల్ కు తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆషిక రంగనాథ్ బాగా యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన లుక్ ఒకటి నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో క్రీమ్ కలర్ ప్లెయిన్ చీరలో దిగిన ఫోటోలు చూస్తుంటే, ఆమె సౌందర్యం మరింత మెరుస్తోందని చెప్పవచ్చు. ఓ ఫోటోలో ఆమె చిరునవ్వు కుర్రకారును ఆకర్షిస్తుండగా, మరో ఫోటోలో ఆషిక కవ్వింపు అందాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చీరకట్టులో ఆమె అందం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆషిక రంగనాథ్‌కు సంబంధించిన అప్‌కమింగ్ ప్రాజెక్టులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ‘విశ్వంభర’లో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్ యూ’ చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.